సినిమా హిట్ అయితే ఆ దర్శకులను హీరోలు, నిర్మాతలు గిప్ట్ లు ఇచ్చి ఉత్సాహపరుస్తూంటారు. ముఖ్యంగా దిల్ రాజు వంటి నిర్మాతలు తన టీమ్ హ్యాపీగా ఉంటేనే తను హ్యాపీగా ఉండగలుగుతాను అని నమ్ముతారు. అందుకేనేమో ఆయన ఖాతాలో ఎక్కువ విజయాలు కనిపిస్తాయి. రీసెంట్ గా ఆయన ‘ఎఫ్ 2’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా భారీ లాభాలను తీసుకురావడంతో, ప్రొడక్షన్ టీమ్ ను ఆయన బ్యాంకాక్ పంపించారు. ఇందుకోసం ఆయన 50 లక్షల వరకూ ఖర్చు చేసినట్టుగా చెప్పుకున్నారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా తాజాగా 50 రోజులను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా టీమ్ కి ‘ఐ ఫోన్’ లు కానుకగా ఇచ్చారని వినికిడి. ఈ నేపధ్యంలో తనకి ఓ స్పెషల్ గిఫ్ట్ అందిందని అనిల్ రావిపూడి చెప్పాడు. ఆయన అందుకున్న కానుక ‘బీఎం డబ్ల్యూ’ కారు అని చెప్పుకుంటున్నారు. త్వరలో మహేష్ బాబుతో అనిల్ రావిపూడి చేసే సినిమాకి కూడా దిల్ రాజు నిర్మాత అనే సంగతి తెలిసిందే.