అప్పట్లో ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చి హిట్టైన చిత్రం కంత్రి. ఇప్పుడు ఎన్టీఆర్ బాబాయ్ బాలయ్య ఇలాంటి పోలికలతో ఉన్న టైటిల్ తో ఓ చిత్రం చేయబోతున్నారు. దాంతో అందరూ ఎన్టీఆర్ చిత్రాన్ని తలుచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ రెండు టైటిల్స్ హాట్ టాపిక్ గా మారాయి.
వివరాల్లోకి వెళితే..‘జై సింహా’ తరువాత హీరో బాలకృష్ణ, దర్శకుడు కె.యస్.రవికుమార్ కాంబినేషన్‌లో మరో చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సి.కల్యాణ్ ప్రొడక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నాడని టాక్.
అందులో ఒక పాత్ర.. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అని తెలిసింది. మొదట , ఈ చిత్రానికి ఆ మధ్య ‘రూలర్’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అ తర్వాత సింహా పదం టైటిల్ లో కలిసొచ్చేలా టైటిల్ అనుకున్నారట. అయితే, ఇప్పుడు టైటిల్‌లో మార్పు చోటుచేసుకుందని తెలిసింది.
ఫ్లిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి ‘క్రాంతి’ అనే పేరుని ఫిక్స్ చేసినట్లు టాక్. చిత్రంలో హీరో పాత్ర పేరు క్రాంతి అని.. అందుకే అదే టైటిల్‌ని ఖరారు చేసే దిశగా యూనిట్ ఆలోచిస్తోందని సమాచారం. త్వరలోనే ఈ టైటిల్‌పై ఫుల్ క్లారిటీ రానుంది. ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ ప్రాజెక్ట్.. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.