డైరక్టర్ కు అల్టిమేటం ఇచ్చిన బాలయ్య ?

డైరక్టర్ కు అల్టిమేటం ఇచ్చిన బాలయ్య ?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా సినిమా మొదలైన సంగతి తెలిసిందే. `జైసింహా` వంటి హిట్ త‌ర్వాత ఈ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం లాంచ్ అయి చాలా కాలం అయినా సినిమా ప్రారంభం కాలేదు. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలు కాబోతోందని చెప్పబడుతున్న ఈ చిత్రం విషయంలో బాలయ్య..దర్శకుడు కు అల్టిమేటం ఇచ్చారట. ఏ విషయంలో అంటే రిలీజ్ మ్యాటర్ లో అని తెలిసిందే.

మొదట ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ సంక్రాంతికి వరస పెట్టి మహేష్, బన్ని సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతూండటంతో వాటికి దారి ఇవ్వాలని బాలయ్య ఫిక్స్ అయ్యారట. అందుకనే తన సినిమాని సంక్రాంతికి ముందే క్రిసమస్ కు రిలీజ్ పెట్టుకోవాలని దర్శక,నిర్మాతలకు చెప్పారట. దాంతో ఇప్పుడు టీమ్ మొత్తం పరుగులు పెడుతోందిట. అయితే కెఎస్ రవికుమార్ చాలా స్పీడుగా సినిమా పూర్తి చేసే ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు కావటంతో …బాలయ్య చెప్పినట్లే రిలీజ్ చేయచ్చని అంటున్నారు.

ఇక ఈ సినిమాకి ‘రాయల సింహా’ అని టైటిల్ పెట్టాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ అండ్ వేదిక ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. అలాగే ఓ కీలకమైన పాత్రలో నమితను కనిపించనుంది. నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ బ్యాంకాక్‌ లో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య – సోనాల్ చౌహాన్ మరియు వేధికల సాంగ్స్ ను షూట్ చేయనున్నారు.

స‌మ‌ర్పణ: సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
బ్యాన‌ర్‌: హ్యాపీ మూవీస్‌
ద‌ర్శక‌త్వం: కె.ఎస్‌.రవికుమార్‌
క‌థ‌: ప‌రుచూరి ముర‌ళి
సంగీతం: చిరంత‌న్ భ‌ట్
సినిమాటోగ్ర‌ఫీ: సి.రామ్‌ప్రసాద్‌
ఆర్ట్‌: చిన్నా
డైలాగ్స్‌: ర‌త్నం
ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌
నిర్మాత‌: సి.క‌ల్యాణ్‌
కో ప్రొడ్యూస‌ర్‌: సి.వి.రావ్‌