బాలయ్యకు రాజశేఖర్ భలే దెబ్బ కొట్టేడే!?
గరుడువేగ చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్..రీసెంట్ గా వచ్చిన కల్కితో మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ట్రై చేద్దామనుకున్న రాజశేఖర్ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిపోయింది. దాంతో మళ్లీ తన జడ్జిమెంట్ ని ఓ సారి సరిచూసుకుని, తనకు అలవాటైన రీమేక్ తో రచ్చ చేద్దామని ఫిక్స్ అ్యయాడు. అందుతున్న సమాచారం మేరకు రాజశేఖర్ త్వరలో ఓ కన్నడ రీమేక్ చేయటానికి సిద్దదపడుతున్నాడు. అయితే ఇక్కడే బాలయ్యకు ట్విస్ట్ పడింది.
గత సంవత్సరం కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం మఫ్టీ. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు ఉంటారు. శివరాజ్ కుమార్ , మరో యంగ్ హీరో. దాంతో బాలయ్యతో ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నారు వివివినాయిక్. బాలయ్య కూడా ఈ సినిమా చూస్తాను అన్నారు. కానీ ఆయనే వేరే ప్రాజెక్టుల హడావిడీలో ఆలస్యం చేసారు. అయితే ఈ లోగా రాజశేఖర్ ఈ సినిమా చూడటం జరిగింది. వెంటనే లాక్ చేసేసారట.
దాంతో రాజశేఖర్ కు సాలిడ్ మాస్ సినిమా దొరికినట్లు అయ్యింది. బాలయ్యఈ లోగా చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలోగా ఇదంతా జరిగిపోవటంతో వినాయిక్ డీలా పడ్డారని తెలుస్తోంది. ఇప్పుడు మరో యంగ్ హీరోని చూసుకుని రాజశేఖర్ ఈ రీమేక్ మూవీని చేయాలి. ఇదీ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న వార్. మరో నెల రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్ గా తెలిసే అవకాసం ఉంది.