‘సింహా’ సెంటిమెంట్ వదలని బాలయ్య
సినిమా హిట్ అయ్యితే కొన్నాళ్ళకు అదో సెంటిమెంట్ అయ్యికూర్చుంటుంది. అందులో చేసిన హీరోయిన్, కమిడయన్, టైటిల్ అన్ని పరిగణనలోకి వస్తాయి. మళ్లీ వాటిని రిపీట్ చేస్తే హిట్ వస్తుందనే నమ్మకం కుదురుతుంది. అది ఇండస్ట్రీలో చాలా కాలంగా జరుగుతున్న వ్యవహారం. బాలయ్య సైతం ఇలాంటి సెంటిమెంట్ నే నమ్ముకుని ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే… నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకి ‘రాయల సింహా’ అని టైటిల్ పెట్టాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
దాంతో మొత్తానికి బాలయ్య మళ్లీ సింహా సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నాడు. అయితే ఈ టైటిల్ కి సంబంధించి ఇంకా ఇటివంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. అలాగే ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ అండ్ వేదిక ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. అలాగే ఓ కీలకమైన పాత్రలో నమితను కనిపించనుంది. నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావటం విశేషం.
ప్రస్తుతం ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ బ్యాంకాక్ లో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య – సోనాల్ చౌహాన్ మరియు వేధికల సాంగ్స్ ను షూట్ చేయనున్నారు. అయితే సోనాల్ చౌహన్ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్, డిక్టేటర్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘డిక్టేటర్’ తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం.