‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్నట్టు…అనుష్క పై !

‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్నట్టు…అనుష్క పై !

స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కనిపించబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని తెలిసింది. అసలు ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రే లేదట. ఈ సినిమాలో అనుష్క పాత్ర స్టోరీ టెల్లర్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే..మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో అనుష్క నటించిదట. ఆ న్యూస్ బయిటకు వచ్చి.. అనుష్క సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించనుందని రచ్చ మొదలైంది. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లు మీడియా ఈ న్యూస్ ని విస్తరించుకుంటూ పోయింది . ఈ విషయమై గత కొన్ని రోజులు నుంచీ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. ఆమె కేవలం ఈ కథను నేరేట్ చేసే స్టోరీ టెల్లర్ గానే ఉండబోతోంది.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు టీమ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.