‘బిగ్ బాస్ 3’: ఉదయభాను.. అంత డిమాండ్ చేసిందా?

‘స్టార్ మా’ ఛానల్లో ప్రసారమైన ‘బిగ్ బాస్’ ఎంత పాపులరైందో తెలిసిందే. ఈ షో సీజన్ 1 కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ రియాలిటీ షోకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నాని వ్యాఖ్యాతగా ‘బిగ్ బాస్ 2’ ప్రసారమైంది. తనదైన స్టైల్ లో నాని కూడా ఈ రియాలిటీ షోను రక్తికట్టించాడు. ఇక ‘బిగ్ బాస్ 3’ షోకి హోస్ట్ గా నాగార్జునను చేయబోతున్నట్లు సమాచారం.

ఇక బిగ్ బాస్ కు వ్యాఖ్యాత ఎంత ప్రాముఖ్యతో అందులో పాల్గొనే పార్టిసిపెంట్స్ కూడా అంతకు మించి ఇంపార్టెంట్. ‘బిగ్ బాస్ 2’ విషయానికొస్తే పార్టిసిపెంట్స్ ఎంపిక విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. అందువలన ‘బిగ్ బాస్ 3’ పార్టిసిపెంట్స్ విషయంలో షో నిర్వాహకులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం.

కేవలం క్రేజ్ వున్న వారిని మాత్రమే ఈ ధర్డ్ సీజన్ కు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆ లిస్ట్ లో ఉదయభాను పేరు మొదటిగా వినిపిస్తోంది. యాంకర్ గా .. నటిగా ఉదయభానుకు మంచి క్రేజ్ వుంది. అందువలన ఆమెను అడిగారని అంటున్నారు. ఎలిమినేట్ అయ్యేంతవరకూ రోజుకి 2 లక్షల పారితోషికం ఇస్తామని ఆఫర్ చేసి ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఈ సీజన్ లో అత్యధిక రెమ్యునేషన్ తీసుకునేది ఆమెనేనని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంతన్నది చూడాలి మరి.