స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఏదన్నా చెప్తే వాళ్లు వెంటనే కనెక్ట్ అవుతూంటారు. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ ని తమ సినిమా ఫంక్షన్స్ కు పిలవటం ద్వారా కలిసివస్తుందని భావిస్తూంటారు సినిమా జనం. దానికి తగినట్లుగానే ఆ మధ్యన విజయ్ దేవరకొండ చిత్రాల ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా వెళ్లటం, అవి సక్సెస్ అవటం జరిగింది. అలాగే ఈ మధ్యన ఆయన హాజరైన రెండు చిత్రాల ప్రీ రిలీజ్ పంక్షన్స్ లకు హాజరయ్యారు. శర్వానంద్ ..పడి పడి లేచే మనసు, ప్రియా ప్రకాష్ వారియర్ లవర్స్ డే చిత్రాలు.
అయితే ఆ రెండు చిత్రాలు పెద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో హఠాత్తుగా అల్లు అర్జున్ అదృష్టం తిరగబడిందని, అంటూ ఈ రెండు సినిమాలను ఉదాహరణగా చూపెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అల్లు అర్జున్ అభిమానులకు ఇది మండించే అంశమే.
ఈ సమయంలోనే ఓ విషయం గుర్తించుకోవాలి. సినిమాలో కంటెంట్ ఉంటేనే స్టార్ వ్యాల్యూ అనేది ఉపయోగపడుతుంది. లేకపోతే స్టార్ నటించిన సినిమాలే బోల్తా పడుతూంటాయి. అలాంటివి వారు అటెండ్ అయిన ఫంక్షన్స్ గురించి కామెంట్ చేయటం అనేది పద్దతి కాదు. ఎందుకంటే ఎవరూ కూడా సినిమా ప్లాఫ్ అవ్వాలని దీవించరు కదా. బన్ని లాంటి హీరో …కాస్త సినిమాలను ప్రమోట్ చేసేటప్పుడు కూడా ముందు వెనకా చూసుకోవాల్సిన అవసరం ఉంది.