‘ఓ బేబీ’ హిందీ రీమేక్, సమంత పాత్ర కు ఎవరంటే..

‘ఓ బేబీ’ హిందీ రీమేక్, సమంత పాత్ర కు ఎవరంటే..

కొరియాలో విజయవంతమైన మిస్ గ్రానీ చిత్రం ఇప్పటి వరకు ఏడు భాషల్లో రూపొందింది. తెలుగులో కూడా తాజాగా రిలీజయ్యి భారీ విజయాన్ని దక్కించుకొన్నది. దాంతో ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత సురేష్ బాబు. ఈ నేపధ్యంలో తెలుగులో స‌మంత చేసిన పాత్ర‌లో హిందీలో ఎవరు చెయ్యబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ మేకర్స్ కు ఓ బేబి స్పెషల్ స్క్రీనింగ్ చేసారు. దాంతో వారు ఈ సినిమాని కలిసి చేద్దామనే ప్రపోజల్స్ పెడుతున్నట్లు సమాచారం. సమంత చేసన పాత్రలో కంగ‌నా రనౌత్ లేదా అలియా భట్ న‌టిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే అలియా భట్ ఓకే చేసే అవకాసం ఉందని అంటున్నారు. అయితే ఆమె వరస ప్రాజెక్టులతో బిజిగా ఉంది. కానీ అలియా భట్ అయితేనే ఈ సినిమాకు స్పెషల్ క్రేజ్ వస్తుందని సురేష్ బాబు, రానా భావిస్తున్నారు.

70 ఏళ్ల వృద్దురాలు తిరిగి 24ఏళ్ళ పడచు పిల్ల వయసులోకి వ‌స్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అన్న నేప‌థ్యంతో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం హిందీ ప్రేక్ష‌కుల‌ని కూడా త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.