మహేష్ సినిమాలో మరో మాజీ హీరోయిన్ రీ ఎంట్రీ

మహేష్ సినిమాలో మరో మాజీ హీరోయిన్ రీ ఎంట్రీ

హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సంగీతను మర్చిపోరు. ఖ‌డ్గం`, `శివ‌పుత్రుడు`, `ఖుషీ ఖుషీగా`, `పెళ్ళాం ఊరెళితే`, `సంక్రాంతి` వంటి ప‌లు చిత్రాల‌తో తెలుగు వారికి దగ్గరైంది సంగీత. అయితే సంగీత పెళ్లి త‌ర్వాత తెలుగు సినిమాల‌కు దూరంగా ఉండిపోయింది. చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది. అడ‌పా ద‌డ‌పా తమిళ చిత్రాల్లో న‌టిస్తున్నా పెద్దగా పేరు తెచ్చిపెట్టిందేమీలేదు. అయితే ఈమె అభిమానులకు శుభవార్త. త్వ‌ర‌లోనే తెలుగు వెండితెర‌పై రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అదీ మహేష్ సినిమాతో కావటం విశేషం.

మ‌హేశ్ హీరోగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ఈ సినిమాలో హీరోయిన్‌తో పాటు ఉండే ఓ కీల‌క పాత్ర‌లో సంగీత న‌టించ‌బోతున్నార‌ట‌. హాట్ ఆంటీగా ఈ సినిమాలో ఆమె కనిపించబోతోంది. ఇది సంగీతకు మంచి క‌మ్ బ్యాక్ మూవీ అవుతుందంటున్నారు. ఇక ఈ సినిమాలో సంగీత‌తో పాటు విజ‌యశాంతి, బండ్ల గ‌ణేశ్ కూడా రీ ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం.

ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. మహేశ్ బాబు తదితరులపై కొన్ని సన్నివేశాలను కశ్మీర్ లోను చిత్రీకరించారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ వేస్తున్నారు. కర్నూల్ – కొండారెడ్డి బురుజు, ఆ పరిసర వీధులకు సంబంధించిన సెట్ ను వేస్తున్నారు.ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.