రవిబాబు ‘క్రష్’ వెనుక కథేంటి?

టాలీవుడ్ లో గతంలో అనసూయ, అమరావతి, అవును, అల్లరి లాంటి చిత్రాలను రూపొందించి దర్శకుడిగా తనకంటూ వైవిధ్యమైన ముద్రవేసుకున్న రవిబాబు తాజాగా మరో చిత్రాన్ని రూపొందించనున్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో ఆయన ‘క్రష్’ అనే చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమవుతున్నారు.

చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈనెల 24 నుండి ఈ సినిమా ప్రారంభం కానుందని యూనిట్ తెలియజేసింది. వీలైనంత వేగంగా సినిమాను పూర్తిచేసి వేసవికి సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. త్వరలో అన్ని వివరాలు ప్రకటిస్తామని యూనిట్ తెలియజేసింది.

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథనాలు ఎంచుకునే రవిబాబు ఈసారి యువతరానికి మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. ఈ చిత్రం గురించి టాలీవుడ్ లో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. రవిబాబు ‘క్రష్’ వెనుక కథేంటి? అని అంతా ఆలోచిస్తున్నారు!?