నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’ మిషన్‌ వెనక కథ ఇదేనా!?

 నాగార్జున హీరోగా నూతన దర్శకుడు అషిషోర్‌ సోల్మాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమాలో ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌వర్మ ఓ మిషన్‌ నిమిత్తం ముంబై లో ఉన్నారు. మరి ఈ మిషన్‌ వెనుక ఉద్దేశం ఏంటో తెలియడానికి ఇంకా టైమ్  ఉంది.
 
వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌  ముంబైలో ప్రారంభం అయింది.  ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు యూనిట్‌. వేసవికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి  షానీ డియోల్‌ అందిస్తున్న కెమెరా ప్రధాన ఆకర్షణ కానుందట. నాగార్జున మిషన్‌ వెనక కథ ఏంటో? అని నాగ్ అభిమానులే కాదు.. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.