షాక్: ‘సాహో’ 70కోట్ల డెఫిషిట్ రిలీజ్?
సాహో సినిమా భారీ అంచనాలతో రిలీజైంది. ఇప్పటికే వారం రోజులు పూర్తైపోయాయి కూడా. మొదటి 4 రోజులు శెలవలు ఉండటంతో భారీ వసూళ్లు అయితే వచ్చాయి. కానీ ఆ తర్వాత వారం మొదలు కాగానే సినిమా కలెక్షన్స్ డ్రాప్ భారీ గా మొదలైపోయింది. దాంతో బయ్యర్లలో కొత్త టెన్షన్ మొదలైంది.
అయితే ఇప్పటికి సాధించిన షేర్ చూస్తే .. ఇంకో 80 కోట్ల వరకూ రాబట్టాల్సి ఉంటుందని,అప్పుడే లాభాలు మాట ప్రక్కన పెట్టి ముందు సేఫ్ గా బయిటపడతారని ట్రేడ్ అంచనా వేస్తోంది. అయితే కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయిన ఈ సిట్యువేషన్ లో అంత పెద్ద మొత్తం రాబట్టడం ఈజీ కాదు. ఈ చర్చ జరుగుతూండగానే మరో విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్గదా మారింది.
అదేమిటంటే… ఈ సినిమాని 70 కోట్ల మేర డెఫిసిట్ తో రిలీజ్ చేసిందిట యువి సంస్థ. ఆ డెఫిషిట్ లో సగం నేను భరిస్తానని ప్రభాస్ హామీ ఇచ్చాకే రిలీజ్ చేశారని చెప్తున్నారు. అంతేకాదు తెలుగు పరిశ్రమకి చెందిన ఇద్దరు పెద్ద నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్స్ సాయం చేయడంతో సాఫీగా రిలీజ్ అయ్యింది. ఇదంతా జరగటానికి ఇరవై రోజులు దాకా పట్టిందిట. అందుకే రిలీజ్ వాయిదా వేసారట.
అయితే ఇంత కష్టపడి, డెఫిషిట్ లో రిలీజ్ చేస్తే నెగిటివ్ రివ్యూలు, పూర్ టాక్ సినిమాని భారీగా దెబ్బ కొట్టాయి. అయితే హైప్ అనేది ప్లస్ అయ్యింది. దాంతో ఇప్పటిదాకా వచ్చిన మొత్తం రాబట్టిగలిగారు. ఈ వీకెండ్ కూడా కాస్త సినిమా లేచి, ఊపితే ఒడ్డున పడిపోవచ్చు. కానీ ఎంతవరకూ జరుగుతుందనేది చూడాల్సిన అంశం.