‘సాహో’ని గుడ్డిగా ఫాలో అయితే ‘సైరా’ కు దెబ్బే

‘సాహో’ స్ట్రాటజీని ఫాలో అవుతున్న ‘సైరా’

పెద్ద సినిమాలు బిజినెస్ పర్పస్ కోసం రకరకాల స్ట్రాటజీలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందులో ఒకటి బడ్జెట్ ని పెంచి చెప్పటం…తద్వారా ఎక్కువ బిజినెస్ చేసుకునేందుకు వీలవుతుంది. అలాగే ప్రేక్షకులకు ఓ రేంజి సినిమా చూస్తున్నాం అనే ఫీల్ కలుగుతుంది. ఆ స్ట్రాటజీని ఈ మధ్యన సాహో ఫాలో అయ్యింది. బడ్జెట్ 170 కోట్లు ఉంటే 350 కోట్లు దాకా ఖర్చు పెట్టమని ప్రచారం చేసింది.

ఇప్పుడు సైరా మేకర్స్ కూడా అదే స్ట్రాటజిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ రెండు వందల కోట్ల లోపే ఉన్నా 250 కోట్ల దాకా ఖర్చుపెట్టామని చెప్తున్నారు. అయితే సాహో అవుట్ ఫుట్ చూసి జనం 350 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా ఇలా ఉందేంటి అన్నారు. దాంతో సైరా టీమ్ ఈ విషయంలో జాగ్రత్తపడాలనుకుందిట. మరీ మూడు వందల కోట్లు దాటింది అని చెప్పటం లేదు. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్‌లో రికార్డులు తిరగరాస్తుంది. ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో తెలుగు సినిమాలు ఇప్పటి వరకు అందుకోలేని రికార్డులను చేరుకుంటుంది సైరా.

స్వాతంత్ర్య సమరయోథుడు సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తుండగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఆ మధ్యన ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేస్తే రికార్డ్ స్దాయిలో డిజిటల్ వ్యూస్ సాధించింది. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయనున్నారు.