విశాల్ నిశ్చితార్దం రద్దైందా..అసలేం జరిగింది?

ఆమెతో  విశాల్ నిశ్చితార్దం రద్దైందా…కారణం ఇదేనా?

తమిళ స్టార్ హీరో విశాల్ నిశ్చితార్ధం ఆ మధ్యన హైదరాబాద్ అమ్మాయి అనీషాతో జరిగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇద్దరు కలిసి టర్కీ కూడా వెళ్లొచ్చారు. తర్వాత ఇక పెళ్లై కదా అనిఎదురుచూస్తూంటే ఆ వార్త మాత్రం వినిపించటం లేదు. దానికి తోడు అనీషా సోషల్ మీడియాలో వీరి ఫోటోలను వరసగా డిలీట్ చేయడంతో… అనేక అనుమానాలకు దారితీసింది.

ఈ విషయం ఇంతగా హైలెట్ అవటానికి కారణం…తన నిశ్చితార్ధం ఫోటోలు, విశాల్ కి సంబంధించిన ఫోటోలు తరచూ అనీషా పోస్ట్ చేసేది. విశాల్ కూడా ట్విట్టర్ లో ఫోటోలు షేర్ చేసేవారు. ఇన్స్టాగ్రామ్ లో తరచూ పోస్ట్ లు పెట్టే అనీషా సడెన్ గా తన నిశ్చితార్ధపు ఫొటోలన్నీ తొలగించిందిఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. ఇద్దరు విడిపోయారని వార్తలు మొదలు అయ్యాయి.

ఇక అనీషా సైతం సినిమా ఫీల్డ్ పరిచయం ఉన్న అమ్మాయే. తెలుగులో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. టెంపర్ సినిమా రీమేక్ అయోగ్య సినిమా షూటింగ్ సమయంలో అనీషాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దేవుడే అనీషాను తనకోసం పంపాడని అప్పట్లో విశాల్ చెప్పాడు. నిశ్చితార్ద కార్యక్రమం అతి తక్కువమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగింది. అక్టోబర్ 9న వివాహానికి ముహూర్తం కూడా పెట్టారు. కానీ ఇప్పుడు వీరిద్దరూ ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్నట్లు సమాచారం. కానీ ఇలా ఊహించని ట్విస్ట్ పడింది.

విశాల్-అనిషా పెళ్లి రద్దు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునేలోపే ఇలాంటి షాకింగ్ న్యూస్ అభిమామాల్లో, మీడియాలో చర్చనీయాంశం అయింది. అనీషా రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.