బాలయ్య హుషారుకు కారణం ఈమేనా?!

బాలయ్య సినిమాలు   హీరోయిన్ల కొరత కారణంగా ప్రాజెక్టులు  ఆలస్యమవుతుండటం తెలిసిందే. బాలకృష్ణ -బోయపాటి ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లే టైం లో అంతా సిద్ధమైనా హీరోయిన్ల కొరత కారణంగా ప్రాజెక్టు ఆలస్యమవుతుందట. పూజాధికాలు నిర్వహించి ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించినా -బాలయ్యకు జోడీ దొరక్క షూటింగ్‌కు వెళ్లలేకపోతున్నారన్న కథనాలు వినిపిస్తూ వచ్చాయి.
 
అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టులోకి ఇద్దరి హీరోయిన్ల ఎంపిక విషయం కొలిక్కి వచ్చేసిందన్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడు బోయపాటి సీనియర్ హీరోయిన్ శ్రీయాశరణ్‌తో చర్చించి ఆమెను ఓకే చేసుకున్నాడన్న కథలున్నాయి. సెకెండ్ ఫిమేల్ లీడ్ కోసం అంజలిని ప్రాజెక్టులోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. అంజలి విషయంలో బాలయ్య చాలా ఉషారుగా ఉన్నట్లు చిత్రం యూనిట్ చెబుతోంది. ఈ అమ్మడిని బాలయ్యే ఓకే చేసుకున్నట్టు చెబుతున్నారు.  
 
ప్రస్తుతం అంజలి ‘నిశ్శబ్దం’ చిన్న సినిమా పూర్తి చేసి విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఆమె చేతిలో మరే సినిమాలూ లేవు. గతంలో బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన డిక్టేటర్ చిత్రంలో అంజలి హీరోయిన్‌గా చేసింది. అలాగే బోయపాటి ‘సరైనోడు’ చిత్రంలోనూ ప్రత్యేక పాటతో మెప్పించింది. సో, ఈ ప్రాజెక్టు కోసం బోయపాటి ఆమెను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడట. సినిమాలు లేవు కనుక అంజలి కూడా నో చెప్పే పరిస్థితి లేదు.