ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ‘ఓజీ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత అనారోగ్యం పాలైన పవన్, తొలుత అసెంబ్లీ సమావేశాలు, అధికారిక సమీక్షలకు హాజరైనా.. ఆ తర్వాత దగ్గు కూడా తోడవడంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారు. ఈ విషయాన్ని జనసేన వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
అయితే, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల తాజాగా ఘాటైన సెటైర్లు విసిరారు. పవన్ ఫీవర్‌పై ఎక్స్ (ట్విట్టర్)లో ఆమె ఓ పోస్టు పెట్టారు. పవన్ ఫీవర్ సాధారణమైనది కాదంటూ, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని సమస్యలను ప్రస్తావించి, అవి పరిష్కారమయ్యే వరకు పవన్ జ్వరం తగ్గదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు: కూటమి ప్రభుత్వం శుభవార్త
హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవండి: పవన్ కల్యాణ్ పిలుపు
శ్యామల ట్వీట్ యథాతథంగా:
“అయ్యబాబోయ్ .. అది మామూలు జ్వరం కాదట ..!
విశాఖ ఉక్కును, మెడికల్ కాలేజీ లను పూర్తిగా అమ్మేసే వరకు, రైతులు, ఆటో కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పిఠాపురంలో మత్స్యకారులు, చిరు అభిమానులు శాంతించే వరకు … ఆయనకి జ్వరం తగ్గదట!
గెట్ వెల్ సూన్ పీపీపీ గారూ, పవన్ కళ్యాణ్ గారూ”
అలాగే, తన ట్వీట్‌ను “గెట్ వెల్ సూన్ పీపీపీ గారూ, పవన్ కళ్యాణ్ గారూ” అంటూ ముగించారు.
శ్యామల సెటైర్లపై జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. “గత ఐదేళ్లూ మీ కంటే ఎక్కువ ఎగిరారని, ఒక్కసారి తిరగేస్తే తిరిగి కోలుకోని స్థితికి పోయారని” రివర్స్ పంచ్‌లు విసురుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తం మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

