మతోద్ధారకులా?  మతోన్మాదులా? 

YS Jagan visits tirumala
జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడం, వ్యక్తిత్వాన్ని కించపరిచేవిధంగా కథనాలు రాయడం, అక్రమ కేసులు పెట్టి వేధించడం, చివరకు పదహారు నెలలు జైల్లో బంధించడం, బెయిల్ రాకుండా అడ్డుకోవడం, తన చేతిలో ఉన్న పచ్చ మీడియాతో అప్రతిష్టపాలు చెయ్యాలని ప్రయత్నించడం,  తమ దుర్మార్గాలకు న్యాయస్థానాలను కూడా బలిచేయ్యడం…ఎన్ని కూహకాలు పన్నినా ప్రజలు ఏమాత్రం విశ్వసించకుండా ఆయనకు అక్షరాలా నూట యాభై ఒక్క సీట్లను కట్టబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు.  జగన్ మీద కుట్రలు పన్నినవారందరినీ తరిమికొట్టారు.  ఒకసారి చూడండి…చంద్రబాబు, లోకేష్, సోనియా, రాహుల్, చిదంబరం, గులాం నబీ ఆజాద్, కిరణ్ కుమార్ రెడ్డి, వివి లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్…వీరందరికి ఎలాంటి దుర్గతి పట్టింది?  ఈ జన్మలో మళ్ళీ వీళ్లకు అధికారం దక్కే అవకాశం ఎవరికైనా కనిపిస్తున్నదా?  చెరపకురా చెడేవు అన్న సామెతకు వీరందరూ ఉదాహరణగా నిలబడితే…నీతికి, నిజాయితీకి, న్యాయానికి కట్టుబడి ధైర్యంగా నిలబడిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ దుర్భేద్యంగా వెలిగిపోతున్నాడు!  
 
YS Jagan visits tirumala

ఆడలేక మద్దెల ఓడు 

రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం చేతకాని చంద్రబాబు ఆయన ముఠా ఆఖరుకు జగన్ మతం మీద పడ్డారు.  ఒక ముఖ్యమంత్రిగా ఆయన తిరుమల శ్రీవారి సేవలకు పూర్తిగా అర్థుడు.  ఆయన మతాన్ని తెరపైకి తెచ్చి, కొందరు క్షుద్ర కపట సన్నాసులను రెచ్చగొట్టి, పచ్చమీడియాలో గరళాన్ని కక్కిస్తూ జగన్ ను నిలువరించాలని చంద్రబాబు చేస్తున్న దుష్ట యత్నాలను ప్రజలు చీదరించుకుంటున్నారు.  ఒక పరిపూర్ణానంద స్వామి అనబడే ఒక పగటి వేషగాడు  వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇందిరాగాంధీ మరణాలు ఉదాహరణగా చూపిస్తూ జగన్ కూడా అలాగే బూడిదైపోతాడని పిల్లి శాపనార్ధాలు పెట్టడం పట్ల కరుడుగట్టిన హిందువులు కూడా షాక్ అవుతున్నారు. 
 
హిందూ మతం ఉద్ధారకుడుని అని చెప్పుకునే ఒక నికృష్టుడు ఇలాంటి శాపాలు పెడుతుంటే హిందూ మతం ఔన్నత్యంను దిగజార్చడం కాదా?  సర్వసంగ పరిత్యాగులు, సమాజహితాన్ని కోరాల్సిన ఈ స్వామీజీలు ఇంత నీచంగా ఒక ముఖ్యమంత్రి పట్ల నోరు పారేసుకోవడం ఎంత దుర్మార్గం?  అందుకే కదా ఈ నీచుడిని హైద్రాబాద్ నుంచి పోలీసులు బహిష్కరించారు!  కేసీఆర్ కాళ్ళు గడ్డాలు పట్టుకుని మళ్ళీ భాగ్యనగరం చేరి తలదాచుకుంటున్న ఈ పరమశుంఠ హిందూమతాన్ని రక్షించేవాడా అంటూ హిందువులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.  హిందుత్వం అనేది ఒక జీవన విధానమే తప్ప మతం కాదనే ధర్మసూక్షం కూడా తెలియని ఈయన స్వామిజి ఎలా అయ్యారు?  అసలు ఈయన సన్నాసిగా మారిన నేపధ్యం ఏమిటి?  చిన జియ్యర్ లాంటి మహనీయుడు సైతం జగన్ చిత్తశుద్ధిని ప్రశంసించారు.  అంతకన్నా జగన్ కు సర్టిఫికెట్ మరొకటి దేనికి?  

ఇవేం మాటలు స్వామీ?

Swami Paripoornananda

అసలు ఒక స్వామీజీ అనేవాడు మరణాల గూర్చి మాట్లాడవచ్చునా?  ఇతరుల మరణాన్ని హేళన చేయవచ్చునా?  తనకు గిట్టనివారు చావాలని దూషించవచ్చునా?  ఎవరు ఈయనకు   సన్యాసం ఇచ్చింది?  ఇతనికి  సన్యాసఆశ్రమ ధర్మాలు తెలుసా?   ఇతరుల దుర్మరణాన్ని  కోరుకునే వారు సన్యాసులా?   ఇతనికి ఎలాంటి మరణం వస్తుందో ఎవరికి తెలుసు?     ఇతగాడి వాచాలత, వదరుబోతుతనం మీద పోలీసులు కేసులు పెట్టి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలి.  ఇలాంటి దొంగస్వాములు సమాజానికి, దేశానికి కూడా హానికరం.

చంద్రబాబు భక్తి ఎవడికి తెలియదు?

చంద్రబాబు ఏనాడైనా దైవభక్తిని ప్రదర్శించారా?  హిందూమతానికి ఆయన చేసిన సేవ ఏమిటి?  పుష్కరాల షూటింగులో ముప్ఫయిమంది భక్తులను పొట్టన పెట్టుకోవడం మతోద్ధరణా?  పుష్కరాల పేరుతో వేలకోట్ల రూపాయల నిధులను భోంచెయ్యడమే కాక, నలభై ప్రాచీన దేవాలయాలను కూల్చెయ్యడం మతోద్ధరణా?  తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట ఎప్పుడో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన వెయ్యికాళ్ల మంటపాన్ని కూల్చేసి షాపులకు అద్దెకు ఇవ్వడం మతోద్ధరణా?  శంకుస్థాపనలు, భూమిపూజలు, యాగాలు, యజ్ఞాల సమయంలో కూడా బూట్లు విప్పకుండా దేవుళ్ళ పటాలు పట్టుకుని తిరిగే చంద్రబాబు హిందూ మతాన్ని ఉద్ధరిస్తాడా?  పీహెచ్ డి చేసిన తరువాత ఎంఫిల్ చేశానని చెప్పే అజ్ఞాని  చంద్రబాబు ఒక్క శ్లోకాన్ని పఠించమనండి చూద్దాం!  కనీసం “శుక్లాంబరధరం ” అనే పదాన్ని ఆయన గానీ, ఆయన కొడుకు గానీ పలకమనండి చెవులారా విందాం!  తల్లి తండ్రి మరణం తరువాత వారికి కర్మకాండలు జరిపాడా? 
హిందువుల ఆచారం ప్రకారం శిరోముండనం చేయించుకున్నాడా?    ఇలాంటి అయోగ్యులు సైతం జగన్ భక్తిని విమర్శిస్తుంటే జనం పక్కున నవ్వుతారు.  

ఢిల్లీ పర్యటన విజయవంతం 

YS Jagan Meets Amit Shah

ఒకవంక నిన్న ఢిల్లీ లో జగన్ పర్యటన విజయవంతం అయిందని విశ్వసనీయంగా తెలుస్తున్నది.  ముఖాముఖీ మాట్లాడటంతో చాలావరకూ అపార్ధాలు తొలగిపోయాయని, అందువల్లనే మోడీ కూడా జగన్ ను ప్రశంసించారని వార్తలు వినిపిస్తున్నాయి.  జగన్ అనుకున్న విధంగా దుష్టశిక్షణకు అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటున్నారు.  కేంద్ర జలవనరుల శాఖామంత్రి స్వయంగా జగన్ కు ఎదురొచ్చి స్వాగతం చెప్పడం, మళ్ళీ కారు దాకా వచ్చి వీడ్కోలు పలకడం, అమిత్ షా ఏకంగా నలభై అయిదు నిముషాల పాటు జగన్ తో చర్చలు జరపడం చూస్తుంటే చంద్రబాబుకు పతనదశ శరవేగంగా ముంచుకొస్తున్నదని తేలుతున్నది.  అందుకే దుష్టస్వాములను అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేసే వీరంగాలు….కానీ, ప్రజలు అంత వెర్రివారు కారు.  ఇలాంటి దుష్టుల సంగతి ఆ శ్రీనివాసుడు చూసుకుంటాడు.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు