రేవంత్ రెడ్డి కంటే బెస్ట్ ఆప్షన్ వైఎస్ షర్మిలా రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ గనుక అనుకుంటే ఏంటి పరిస్థితి.? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షర్మిల గనుక సారధ్యం వహించాల్సి వస్తే.? అసలు ఇలాంటి చర్చ ఎందుకు జరుగుతోంది.?
ఎందుకంటే, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో వైఎస్ షర్మిల టచ్‌లోకి వెళ్ళారట మరి.! ప్రియాంక గాంధీతోనూ షర్మిల మంతనాలు జరుపుతున్నారట. ఏంటీ, ఇదంతా నిజమే.? రాజకీయాల్లో నిప్పు లేకుండా కూడా పొగ పుట్టేస్తోంది. ఏమో, ఇక్కడ నిప్పు కూడా వుందేమో.!
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. వైఎస్ షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి రెండు ప్రయోజనాలుంటాయి. ఒకటి తెలంగాణలో రాజకీయంగా లాభపడటం. ఇంకోటి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడం.
దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా పరిస్థితులున్నాయన్నది ఓ వాదన. అందులో నిజమెంత.? అన్నది మళ్ళీ వేరే చర్చ. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్, ఈసారి లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామంటోంది.
ఈ క్రమంలోనే రాజకీయ శక్తులన్నిటినీ ఏకం చేస్తోంది. అందులో భాగంగానే, షర్మిలను కాంగ్రెస్ పార్టీ వైపు లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయట. తెలంగాణ కాంగ్రెస్‌లో కాదుగానీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లోనే షర్మిల చక్రం తిప్పొచ్చన్నది ఓ ఊహాగానం.!