Voter ID Card: ఓటర్ ఐడీ గందరగోళానికి ఎండ్ కార్డ్.. త్వరలోనే కొత్త విధానం

భారత ఎన్నికల సంఘం ఓటర్ ఐడీ నంబర్ల డూప్లికేట్ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. దేశవ్యాప్తంగా 99 కోట్లకు పైగా ఓటర్లు ఉండటంతో, కొన్ని చోట్ల ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓటర్ ఐడీ నంబర్లు కేటాయించబడ్డాయి. దీనివల్ల ఎన్నికల సమయంలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ముఖ్యంగా గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన ఓటర్లు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం, అక్రమంగా ఓటింగ్ జరగడం వంటి ఆరోపణలు వెలుగుచూశాయి.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్నికల సంఘం యూనిక్ ఓటర్ ఐడీ నంబర్ విధానాన్ని అమలు చేయనుంది. దీని ప్రకారం, ఇప్పటికే డూప్లికేట్ గా నమోదైన ఓటర్లకు ప్రత్యేకంగా ఒకే ఒక్క నంబర్ కేటాయిస్తారు. అలాగే, కొత్తగా ఓటింగ్ హక్కు పొందే వ్యక్తులకు కూడా ఈ విధానం వర్తించనుంది. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే ఎన్నికలకు ముందు అన్ని రాష్ట్రాల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో మిశ్రమ స్పందనను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎన్నికల సంఘంపై ఈ సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది. అయితే, EC తన ప్రకటనలో ఈ సమస్యను తటస్థంగా, పారదర్శకంగా పరిష్కరించనున్నట్లు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ఒకేచోట మాత్రమే ఓటు వేయగలిగేలా ఈ కొత్త విధానం పనిచేస్తుందని, భవిష్యత్తులో గందరగోళం లేకుండా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఈ కొత్త విధానం అమలవుతే, దేశవ్యాప్తంగా డూప్లికేట్ ఓటింగ్‌కు అవకాశం తగ్గుతుందని భావిస్తున్నారు. ఓటర్లకు యూనిక్ నేషనల్ EPIC నంబర్ కేటాయించడం వల్ల వారి వివరాలు కచ్చితంగా ఒకేచోట ఉండేలా చేస్తారు. ఈ విధానం దేశ ఎన్నికల చరిత్రలో ఓటింగ్ ప్రామాణికతను పెంచే కీలక అంశంగా మారనుంది.

వలసపోవలసిందే || Chandrababu Destroyed AP Ports, Medical Colleges and AP Education System || TR