ఉపాసన సరోగసీ.! లీక్ చేసిందెవరబ్బా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన.. చాలాకాలంగా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఉపాసన, చరణ్ తల్లిదండ్రులవుతున్నారన్న వార్త బయటకు వచ్చినా, ఉపాసన మీద ట్రోలింగ్ ఆగడంలేదు. సరోగసీ ద్వారా ఉపాసన, చరణ్ తల్లిదండ్రులవుతున్నారంటూ ఓ విషయం ప్రచారంలోకి వచ్చింది. దీన్ని మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన లీక్‌గా ప్రచారం చేస్తున్నారు కొందరు.

ఎవరు ఈ విషయాన్ని లీక్ చేశారో తెలుసా.? అంటూ మెగా కాంపౌండ్‌లోని అల్లు వర్గం మీద నిందారోపణలు చేస్తున్నారు. మీడియా, కొందరు వ్యక్తుల గుప్పిట్లో వున్నట్లుగా ఇటీవల కొన్ని పరిణామాల్ని బట్టి చూస్తే అర్థమవుతుంది.

ప్రధానంగా ఉపాసన విషయంలో అల్లు అర్జున్ అభిమానులు ట్రోల్ చేస్తుండడంతో, అల్లు కాంపౌండ్ ఈ లీక్‌కి పాల్పడుతోందన్న భావన అయితే కలుగుతోంది. సరోగసీ ప్రచారాన్ని ఖండించడంలో అర్థం లేదన్న ఆలోచనతో మెగా కాంపౌండ్ వుందిగానీ, మరీ దారుణమైన ట్రోలింగ్ అయితే జరుగుతోంది.