కోట్ల హృదయాలను కొల్లగొట్టిన కొణిదెల సింహం : తెలుగురాజ్యం ప్రత్యేకం

“63 ఏళ్ళ” ఆజానుబాహుడు, అంజనాదేవి సుపుత్రుడు ప్రేక్షకుల రారాజు, “ప్రాణంఖరీదు” ఎంతో తన జీవితం చూస్తే తెలుస్తుంది. “స్వయంకృషి” తో ఎదిగే ఛాలెంజ్ విసిరి మగమహారాజులాగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మెగాస్టార్ గా స్థిరపడిపోయారు. నిర్మలమైన మనస్సుతో నింగిదాకా నిలిచినా, నిగర్విగా నిత్య కృషీవలుడిగా, నటచక్రవర్తిగా యెనలేని సేవలతో మొగల్తూరు మొనగాడిలా పద్మభూషణ్ తో జగదేకవీరుడిలా జనం మెచ్చిన కథానాయకుడు కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ .

అలనాడు సుధాకర్ కనుసైగ చేసినమేలు వెండితెరపై మేలుపర్వతంలా వేలుగుతున్నాడు. పట్టుదల, శ్రమ,అకుంఠిత దీక్ష ,ఆకలి ఆయుధంగా పోరాడిన అసమాన ప్రతిభాశాలి మన చిరంజీవిగారు.

ఎన్నో ఒడిదొడుకులు మరెన్నో అవాంతరాలు అన్నింటికీ ఒకటే సమాధానం…. తన నటనా, నృత్యాలు, హావభావాలు….అన్నింటికి  మించి ఎంత ఎదిగిన ఒదిగేతత్వం. నాటినుండి నేటివరకు స్ఫూర్తి ప్రధాతగా ఎందరో నటీనటుల జీవితాల ఊపిరి అతడు. నవరసాలతో ప్రేక్షకుడిని మెప్పించి చలనచిత్ర గర్విస్తున్న నటుడిగా దిక్సూచిగా, మూడువేలకు పైగా అభిమాన సంఘాలతో అహర్నిశలు సేవలతో ప్రేక్షకుల ఆశీస్సులతో అగ్రకథానాయకుడిగా “సైరా నరసింహారెడ్డి” అంటున్న జై చిరంజీవ గారికి తన అశేష అభిమానుల తరఫున మరియు తెలుగురాజ్యం ప్రత్యేక ” హార్దిక జన్మదిన శుభాకాంక్షలు “

 

HAPPY BITHDAY TO “MEGASTAR” CHIRANJEEVI