మాస్టారూ.! వేగం తగ్గిందండీ.! గుస్సా అవుతున్నారండీ.!

మెగాస్టార్ చిరంజీవి అంటే.. డాన్సులకి కేరాఫ్ అడ్రస్. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, మెగాస్టార్ చిరంజీవి డాన్సుల్లో వేగం తగ్గింది. ఇంకా ఆయనేమీ పాతికేళ్ళ కుర్రాడు కాదు కదా.!

వయసు మీద పడుతుండడం వల్ల సహజంగానే శరీరంలో కాస్త వేగం తగ్గుతుంది. అయితే, ఆన్ స్క్రీన్ చిరంజీవి ఎనర్జీ మాత్రం అస్సలేమాత్రం తగ్గినట్లు అనిపించదు.

యాక్షన్ ఎపిసోడ్స్ వరకూ ఓకే.. కామెడీ టైమింగ్‌లో చిరంజీవికి సాటెవ్వరు. అయితే డాన్సుల్లో మాత్రం వేగం బాగా తగ్గిపోయింది. వేగం తగ్గితేనేం.. గ్రేస్ మాత్రం పెరిగిందన్నది ఓ వాదన.

‘భోళాశంకర్’ డాన్సుల్లో చిరంజీవి వేగం చూపిస్తున్నా, సెట్స్‌లో ఇబ్బంది పడ్డారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. ఓ వైపు కీర్తి సురేష్, ఇంకో వైపు తమన్నా.. తప్పదు మరి.. ఆ మాత్రం కష్టపడాల్సిందే.