YS Jagan: జగన్ తో టాలీవుడ్ నటుడు.. రాజకీయాల్లో రీ-ఎంట్రీనా?

వైసీపీ నేత, సినీ నటుడు కృష్ణుడు తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బుధవారం రాత్రి తాడేపల్లిలో జగన్‌ను కలిసిన కృష్ణుడు, ఆ సందర్భంలో తీసుకున్న ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఆయన లుక్ చూసిన వారంతా షాక్ అయ్యారు. ఎప్పుడూ లావుగా కనిపించే కృష్ణుడు ఇప్పుడు స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపించడం విశేషం. ఇది కేవలం ఫిజికల్ మేకోవర్ మాత్రమేనా, లేక రాజకీయాల్లో మళ్లీ సీరియస్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

సినిమా కెరీర్ మొదట్లో కమెడియన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న కృష్ణుడు, ఒక సమయంలో హీరోగా కూడా ప్రయత్నించారు. కానీ ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆయన మళ్లీ కమెడియన్ పాత్రలకే పరిమితమయ్యారు. ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత కృష్ణుడు పూర్తిగా రాజకీయాల వైపు మొగ్గు చూపారు. వైసీపీలో చేరిన తర్వాత కొంతకాలం యాక్టివ్‌గా పార్టీలో పాల్గొన్నారు. కానీ ఆ ఉత్సాహం క్రమంగా తగ్గిపోయింది. అయితే జగన్‌ను కలిసిన తర్వాత, ఆయన మళ్లీ రాజకీయాల్లో చురుకుగా ఉండబోతున్నారనే అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కృష్ణుడు వ్యక్తిగత జీవితంపై పెద్దగా వార్తలు లేవు. చాలా మంది ఆయనను కేవలం సినీ కమెడియన్‌గానే చూస్తారు. కానీ ఆయన చింతినాడకు చెందిన ఒక రాజు కుటుంబానికి చెందినవారన్న సంగతి చాలా మందికి తెలియదు. కృష్ణుడు అల్లూరి వర్ష వెంకట సూర్యనారాయణ రాజు కుమారుడు. ఈ కుటుంబం ఒకప్పుడు వేల ఎకరాల భూమిని కలిగిన జమిందారీ కుటుంబం. 1970లో ఇందిరా గాంధీ హయాంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఈ కుటుంబం 4,500 ఎకరాలు కోల్పోయింది. ఈ స్థాయిలో భూములు కోల్పోయిన కుటుంబం ఆ కాలంలో ఏపీలో ఇదొక్కటేనని చెబుతారు.

ఇప్పుడు కృష్ణుడు రాజకీయంగా మళ్లీ యాక్టివ్ కావడమా, లేక జగన్‌ను వ్యక్తిగతంగా కలవడమేనా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో కంటే ఇప్పుడు కృష్ణుడు మరింత ఫిట్‌గా, సీరియస్‌గా కనిపించడం, వైసీపీ నాయకత్వంతో మళ్లీ సాన్నిహిత్యం పెంచుకోవడం, ఆయనను పార్టీ ముందుకు తీసుకురావాలనే యోచన ఉందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

టీడీపీ బైరెడ్డి VS వైసీపీ గురుమూర్తి || Byreddy Shabari Vs Maddila Gurumoorthy In Lok Sabha || TR