టిల్లుగాని డీజేకి కేతిక శర్మ స్టెప్పులు.? ‘బీజే టిల్లు’

సినిమాకి సీక్వెల్ షురూ అయ్యిందిగానీ, ఆ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది మాత్రం తేలడంలేదు. దాదాపు ఓ అరడజను మంది హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని అధికారికంగా ప్రకటితమైనా, ఆ పేర్లు కలిగిన హీరోయిన్లు, సినిమా నుంచి తప్పుకుంటూ వస్తున్నారు.

అనుపమ పరమేశ్వరన్ ఔట్, మీనాక్షి చౌదరి ఇన్.. ఇప్పుడు ఆ మీనాక్షి చౌదరి కూడా ఔట్.. కొత్తగా కేతిక శర్మ పేరు ఇన్.! అంతకు ముందు ఓ నాలుగైదు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఏమయ్యింది.? ఇదంతా ఎవరి వైఫల్యం.?

‘డీజే టిల్లు’ హీరో సిద్దూ జొన్నలగడ్డ ఓ పట్టాన హీరోయిన్ల విషయంలో కుదురుకోలేకపోతున్నాడట. అదే అన్ని సమస్యలకీ కారణమట. మీనాక్షి వర్సెస్ కేతిక.. అని తీసుకుంటే, ఇద్దరూ బెస్ట్ ఛాయిస్ కిందే భావించాలి. మీనాక్షి ఎందుకు కాదనుకుంది.? ఇదే ఇప్పడో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.

కేతికతో సంప్రదింపులు జరిపినా, ఆమె కూడా కొన్ని డౌట్లు ఎక్స్‌ప్రెస్ చేసిందట. ప్రగ్యా జైస్వాల్‌తోనూ ‘టిల్లు స్క్వేర్’ (డీజె టిల్లు సీక్వెల్ టైటిల్ ఇదే) సంప్రదింపులు జరుపుతున్నారన్నది తాజా ఖబర్.