రైతు రచ్చ: బూతు నటికి కూడా అలుసైపోయామా.?

The problems of the farmers will definitely be solved

ఢిల్లీలో రైతులు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల్ని నిరసిస్తూ. కేంద్రం, ఇప్పటికే పలు దఫాలుగా రైతులతో చర్చలు జరిపింది. ఏడాదిన్నరపాటు ఆ వ్యవసాయ చట్టాల్ని అమలు చేయకుండా వుంటామని కూడా రైతులకు తెలిపింది కేంద్రం. సరే, రైతుల వాదన ఏంటి.? ప్రభుత్వం ఆలోచన ఏంటి.? అన్నది వేరే చర్చ. సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. కాస్త సమయం పట్టొచ్చు అంతే. కానీ, ఈలోగా విషయం మరింత పెద్ద వివాదంగా మారుతోంది. ఈ వివాదం దేశం దాటి, ప్రపంచం దృష్టికి వెళ్ళిపోతోంది. ఓ పోర్న్ స్టార్ కూడా బారతదేశంలోని రైతుల గురించి మాట్లాడేస్తోంది. మియా ఖలీఫా అనే ఓ బూతు నటి, రైతుల గురించి ఎందుకు మాట్లాడకూడదు.? అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే మొదలు పెట్టింది. మరికొందరు విదేశీయులు కూడా ఆమెకు వంత పాడుతున్నారు.

The problems of the farmers will definitely be solved

దురదృష్టమేంటంటే, బారతదేశానికి చెందిన కొందరు సెలబ్రిటీలు కూడా, సదరు బూతు నటికి మద్దతిస్తున్నారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, బూతు సినిమాల్లో నటించిన ఓ పోర్న్ స్టార్, పవిత్ర భారతదేశంలోని రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం కాక మరేమిటి.? రైతుల ఆందోళన అర్థం చేసుకోదగ్గదే. కానీ, ఆ రైతుల్ని రెచ్చగొడుతూ, కొన్ని అసాంఘీక శక్తులు, ఇటీవల ఢిల్లీలో మారణమోమం సృష్టించాయి. నిజానికి, ఇప్పుడంతా మాట్లాడుకోవాల్సింది ఆ మారణ హోమం గురించి మాత్రమే. నో డౌట్, ఖచ్చితంగా రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, వారి డిమాండ్లను గౌరవిస్తుంది. ఎందుకంటే, మనది రైతు భారతం. చట్టాలు చేసేశారు గనుక, వాటిని వెనక్కి తీసుకోవడానికి కొంత సమయం పట్టొచ్చుగాక. ఇప్పటికిప్పుడు ఆ చట్టాల వల్ల వచ్చిన ముప్పు రైతులకు ఏమీ లేదు. రైతులు అర్థం చేసుకోవాల్సిన సందర్భమిది. పొరుగనే వున్న గుంట నక్కలు పాకిస్తాన్, చైనా.. వీటితోపాటుగా మరికొన్ని పులులు భారతదేశాన్ని ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాయి. కాస్త అప్రమత్తంగా వుండాల్సిందే.. రైతులు, తమ హక్కుల కోసం పోరాడుతూనే, దేశం కోసం ఇంకాస్త గట్టిగా ఆలోచించి, పొంచి వున్న గుంట నక్కలకు బుద్ధి చెప్పాలని ఆశిద్దాం.