Miss World 2025: మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ లో రేవంత్ రెడ్డి.. పక్కనే నాగార్జునతో ఇలా..

హైదరాబాద్: ప్రపంచ సుందరీమణుల రాకతో చౌమహల్లా ప్యాలెస్ మంగళవారం సాయంత్రం మరింత అందంగా మారింది. మిస్ వరల్డ్ – 2025 పోటీలలో పాల్గొన్న పోటీదారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం విశేషంగా మారింది. కళాత్మక రాజప్రాసాదం చౌమహల్లాలో ఈ అద్భుతమైన ఆతిథ్య కార్యక్రమం జయభేరి మోగించిందని చెప్పాలి.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణితో హాజరవడం విశేష ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ విందులో పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అందాల భామలు హైదరాబాదీ సంస్కృతిని ఆస్వాదించారు. చారిత్రక ప్యాలెస్‌ అందాలను చూసి పులకింత చెందారు. వీరికి బిర్యానీ, హలీం, డబీల్ మిట్టా వంటి వంటకాలు వారికి మధుర జ్ఞాపకాలను ఇచ్చినట్లయ్యాయి.

ఈ వేడుకలో మరో ప్రత్యేకత సినీ నటుడు అక్కినేని నాగార్జున హాజరు కావడమే. ఆయను, సీఎం రేవంత్ రెడ్డి ఒకే టేబుల్ వద్ద కూర్చొని, ఆతిథ్యాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు. సినిమాలు, సాంస్కృతిక రంగం, పాలిటిక్స్.. మూడు రంగాలు ఒక్కచోట కలవడం అరుదైన దృశ్యాన్ని తీసుకొచ్చింది.

నాగార్జున N కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసిన కూడా తెలంగాణా అధికార నేతలతో నాగార్జున చాలా క్లోజ్ గా ఉండడం విశేషం. గతంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమంగా చెరువు స్థలాన్ని కబ్జా చేసి కట్టినట్లు రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు కూడా చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన అనంతరం N కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా అసలు గేమ్ మొదలైంది. అయినప్పటికీ రేవంత్ తెలంగాణ సీఎంతో చాలా క్లోజ్ గా ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పవన్ పై ముస్లింలు కేసు || Journalist Bharadwaj About Muslims Case Filled On Pawan Kalyan || TR