Minor Girl Assault: తునిలో దారుణం: సపోటా తోటలో మైనర్ బాలికపై టీడీపీ నేత లైంగిక దాడి యత్నం

కాకినాడ జిల్లా తునిలో దారుణమైన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన ఓ నాయకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించగా, స్థానికులు గమనించి అడ్డుకున్నారు. నిందితుడిని నిలదీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే…

తుని రూరల్‌ పరిధిలోని ఓ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను, స్థానిక టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం. అనంతరం ఆమెను సమీపంలోని హంసవరం సపోటా తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

బాలికతో నారాయణరావు అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, బాలికను అతని చెర నుంచి కాపాడారు.

నిందితుడి బెదిరింపులు

ఈ ఘటనపై స్థానికులు నారాయణరావును గట్టిగా నిలదీయగా, బాలిక మూత్ర విసర్జన కోసం ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పి అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, స్థానికులు వెనక్కి తగ్గకపోవడంతో, “నేనెవరో తెలుసా? నేను టీడీపీ కౌన్సిలర్‌ను. నన్నే ప్రశ్నిస్తారా? తీవ్ర పరిణామాలు ఉంటాయి” అంటూ వారిని బెదిరించినట్లు తెలుస్తోంది.

ఈ వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

KS Prasad Serious Reaction On Lakshmi Naidu Incident | Chandrababu | Telugu Rajyam