మెగాస్టార్ చిరంజీవి తన కష్టంతో సినిమా ఇండ్రస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఏమీ కాని స్థాయి నుంచి మెగాస్టార్ అయ్యారంటే అది ఆయనకున్న అణుకువ, మంచితనం, ఎంత ఎదిగినా ఒదిగిఉండే తత్వం. దానికి తోడు ఆయన పడిన కష్టం కారణంగానే చిరంజీవి… మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. ఆరుపదులు దాటినా ఆయనతో సినిమా తీయాలని ఇప్పటికీ నిర్మాతలు చిరు ఇంటి ముందు క్యూ కడుతుంటారు. అలాంటి చిరంజీవికి ఉన్న ఇద్దరు తమ్ముళ్లు… వాళ్ల తండ్రి వెంకట్రావు గారికి చేస్తున్న డ్యామేజీలు చూసి.. వీళ్లా చిరంజీవి తమ్ముళ్లు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు!
“మానాన్న ఒక హేతువాది, మానాన్న ఉమ్మడి పార్టీ కమ్యునిస్టు సభ్యుడు. మానాన్న ఎలాంటివాడంటే… మా నాయనమ్మ దీపారాదన చేస్తుంటే.. ఆ దీపారాదనలో సిగరెట్ వెలిగించుకునేవాడు.. దేవుడూ లేడు – దెయ్యమూ లేదు అనేవ్యక్తి” అంటూ పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో చెప్పుకొచ్చారు. దీంతో… ఈ అసందర్భ ప్రేళాపన ఎందుకు? అసలు తన తండ్రి గురించి ఎవరైనా ఇలాంటివి చెబుతారా? పవన్ తాను గొప్ప హిందూభావాలున్న వ్యక్తిగా, బీజేపీకి అవసరమైన తొత్తుగా నిరూపించుకోవాలంటే… తన తండ్రిని అంత అగౌరవపరచాలా? పనికిమాలిన రాజకీయాలకోసం తన తండ్రిని ఇలా రోడ్డుకు ఈడ్చి, హిందూ సమాజం దృష్టిలో దోషిని చేయాలా? అంటూ అప్పట్లో విపరీతంగా విమర్శలొచ్చాయి.
ఇక తమ్మారెడ్డిలాంటి వారైతే… “ఎలక్షన్స్ కోసం సొంత తల్లిదండ్రుల్ని అల్లరి చేస్తున్నావ్. ఆయన అంత అహంకారంగా దేవుడి దీపంతో సిగరెట్ వెలిగించారంటే నేనైతే నమ్మను. మరి ఫ్యామిలీలో ఎవరైనా నమ్ముతారేమో తెలియదు” అంటూ సెటైర్ వేశారు.
ఆ సంగతి అలా ఉంటే… ఇప్పుడు తన తండ్రిని తిట్టించే పనికి పూనుకున్నారు చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు! తాజాగా ఆర్.ఆర్.ఆర్. కి ఆస్కార్ అవార్డు రావడం కోసం సుమారు 80కోట్లు ఖర్చుపెట్టారంటూ తమ్మారెడ్డి బరద్వాజ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ పై స్పందించిన నాగబాబు… “నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు ఆర్.ఆర్.ఆర్. కి ఆస్కార్ కోసం” అంటూ ట్వీట్ చేశారు.
దీంతో నాగబాబు ట్వీట్ పై తనదైన శైలిలో స్పందించిన తమ్మారెడ్డి… “నీయమ్మ మొగుడు అంటాడొకడు. నా అమ్మ మొగుడు నాకు మర్యాద నేర్పించాడు. నాకు సంస్కారం నేర్పించాడు. నాకు నీతిగా బతకడం నేర్పించాడు. నిజం చెప్పడం నేర్పించాడు. నిజం చెప్పి, నిజంగా బతకడం నేర్పించాడు. మీకు నేర్పించారా?” అని ప్రశ్నించారు. అంటే… ఫలితంగా మీ తండ్రి మీకు నేర్పలేదు అని చెప్పడం అన్నమాట!
“చిరంజీవి ఇంతకాలం అంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా… తండ్రితో దిగిన ఫోటోలు పంచుకున్నారు, తన తండ్రి ఎంత కష్టపడి పెంచిందీ చెప్పుకున్నారే తప్ప.. ఆయన పరువు తీసే వ్యాఖ్యలు చేయలేదు, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడలేదు, అనవసరపు కబుర్లు చెప్పలేదు”! అని అంటున్నారు చిరంజీవి గురించి బాగా తెలిసినవాళ్లు!
కానీ… పవన్ కల్యాణ్ – నాగబాబు లు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తన తండ్రిని పంచాయతీల్లోకి లాగుతున్నారు.. ఫలితంగా పెద్దాయన పరువు తీస్తున్నారు.. ఆయన ఆత్మకు శాంతిలేకుండా చేస్తున్నారు” అని వీరిద్దరి గురించి తెలిసిన వాళ్లు ఫీలవుతున్నారు!! దీంతో… “మొన్న చిన్న తమ్ముడు – ఇప్పుడు పెద్ద తమ్ముడు… తండ్రి పరువు తీయడానికే పుట్టారా…? వాళ్ల వల్ల మెగా ఫ్యామిలీకి ఎంత ఉపయోగమో ఏమో తెలియదు కాని… తన తండ్రి పరువు తీయడానికి మాత్రం చాలా ఉపయోగకరం” అంటూ కామెంట్స్ పెడుతున్నారు హర్ట్ అయిన అభిమానులు!