చిరంజీవి “సైరా” సినిమాకు షాక్ (వీడియోలు)

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం “సైరా నరసింహారెడ్డి” సినిమా సెట్ ను రెవిన్యూ అధికారులు కూల్చివేశారు. జూబ్లీ హిల్స్ లోని ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా సినిమా సెట్ ను ఏర్పాటు చేశారనే కూల్చివేశామని రెవిన్యూ అధికారులు తెలిపారు. ఇప్పటికే  ఆ స్థలంలో రంగస్థలం సినిమాకు సంబంధించిన సెట్ ఉంది. అందులో ఒక భాగంగా సైరా నర్సింహా రెడ్డికి సంబంధించిన ఇంటి నిర్మాణానికి సంబంధించిన సెట్ వేశారు.

కొణిదెల ప్రొడక్షన్ పై వస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, జగపతిబాబు. సుధీర్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సినిమా సెట్ ను కూల్చివేయడంతో షూటింగ్ కు అంతరాయం ఏర్పడిందని నిర్వాహకులు అంటున్నారు. అనేక సార్లు చెప్పిన వినకపోవడం వల్లనే సెట్ ను కూల్చివేశామని ఎమ్మార్వో తిరుపతిరావు మీడియాకు తెలిపారు . సినిమా సెట్ ను కూల్చివేసిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

 

[youtube https://www.youtube.com/watch?v=xY7Au4flx4U]

 

 

 

 

 

[youtube https://www.youtube.com/watch?v=7QgG7xPKILc]