స్వీగ్గీ మహిళలొస్తున్నారు, స్వాగతించండి

స్విగ్గీ మహిళలు తొందరల్లో  మీ డో ర్ బెల్ నొక్కనున్నారు. ఫుడ్ డెలివరీ ఇంతవరకు అబ్బాయిలకే పరిమితమయి ఉండింది. ఇపుడు అమ్మాయిలు కూడా వస్తున్నారు. 

అమ్మాయిలకు కూడా ఉపాధి అవకాశాలు పెంచే నిమిత్తం స్విగ్గీ  దేశవ్యాపితంగా రెండు వేల అమ్మాయిలను ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ లుగా నియమించబోతున్నది. ప్రస్తుతం స్విగ్గీలో 200  మంది దాకా పని చేస్తున్నారు.  వీరిసంఖ్యను పెంచి మహిళలను రంగంలోకి తీసుకువచ్చే చర్యలు మొదలుపెట్టారు.

ఫుడ్ డెలివరీ రాత్రి బాగా పొాద్దు పోయే దాకా ఉంటుంది కాబట్టి ఈ రంగంలోకి యువకులే ఎక్కువగా వస్తున్నారు. అయితే, మహిళలను ప్రోత్సహించేందుకు స్విగ్గీ టైమింగ్స్ మార్చేస్తున్నది. మహిళా ఎగ్జిక్యూటివ్ లు సాయంకాలం ఆరుదాకా మాత్ర మే పని చేస్తారు.  మహిళా ఫుడ్ డెలివరీ పార్టనర్స్ కోసం, మేనేజీరియల్ రో ల్ లో ఉన్న మహిళల కోసం స్వీగ్గి ప్రత్యేకంగా హెల్ప్ లైన్  ఏర్పాటు చేస్తున్నట్లు డెక్కన్ హెారాల్డ్ రిపోర్టు చేసింది.

(ఇమెజ్ కర్టసీ డెక్కన్ హెరాల్డ్)

బెంగళూరు స్విగ్గీలో ప్రస్తుతం 10 మంది దాకా మహిళలు పనిచేస్తున్నారు.ఒక నెల కిందట పూజా పి జైన్ అనే బికాం విద్యార్థి స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఫార్ట్ నర్ గా చేరింది. ఆమె వారంరోజుల్లో పనిచేసి వారాంతంలో చదవుసాగిస్తుంది. ‘ ఈ పని మహిళలు చేయగలరా అనే అనుమానం ఉండింది. ఒక రోజు స్విగ్గీ కి ఫోన్ చేసి అవకాశాలున్నాయోమో కనుక్కున్నాను. నాకు అవకాశమిచ్చారు. ఇదొక కొత్త అనుభవం,’ అని పూజా చెబుతుంది.

కస్టమర్ల నుంచి, రెస్టరాంట్ల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఒక మహిళవచ్చి డోర్ బెల్ కొట్టి ఫుడ్ ను డెలివరీ చేస్తుండటంతో కస్టమర్లు కూడా థ్రిల్ అవుతున్నారు. వాళ్లదగ్గిర  నుంచి మంది మద్దతు లభిస్తున్నదని పూజా చెబుతున్నది.

 ఎగ్జిక్యూటివ్ లు దాదాపు నెలకు రు. 30 వేల సంపాదిస్తుంటారు.