సమంత చేజారిపోయిన భారీ ప్రాజెక్ట్.?

ఔను, మయోసైటిస్ అనే అనారోగ్యం బారిన పడిన సమంత నుంచి ఓ భారీ ప్రాజెక్టు చేజారిపోయింది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కాల్సిన ఓ సినిమా చేజారిపోయింది.!

‘యశోద’ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు సమంత తాను మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించి అందరికీ పెద్ద షాకే ఇచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆ సమస్య నుంచి కోలుకునేందుకు పోరాటం చేస్తూనే వుంది. ఇప్పుడామె ఆరోగ్య పరిస్థితి ఏంటి.? అంటే, దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ సరసన సమంత నటించాల్సిన ‘ఖుషి’ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు ఆ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియదు.

హిందీలో సమంత రెండు మూడు ప్రాజెక్టులు చేయాల్సి వుంది. అవన్నీ దాదాపుగా ఆగిపోయినట్లే. ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. అదొక్కటే కాస్త ఊరట.

సమంత ఆరోగ్య పరిస్థితేంటి.? అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో, ఆమెతో సినిమాల్ని ప్లాన్ చేసుకున్న దర్శక నిర్మాతలు ప్రత్యామ్నాయాల్ని వెతుక్కుంటున్నారట. అయితే, సమంతకి రీప్లేస్‌మెంట్ దొరకడంలేదన్న చర్చ అయితే సినీ వర్గాల్లో జరుగుతోంది.