అసలు పేరు వేరు..హీరో మార్చుకోమన్నాడు

నా అసలు పేరు ఆలియా అద్వానీ. ముంబాయిలో చదువు పూర్తి కాగానే సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పటికే ఆలియాభట్‌ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. నా పేరులో కూడా ఆలియా అన్న పదం ఉండడంతో ప్రేక్షకులు కన్‌ఫ్యూజన్‌ అవుతారన్న ఉద్దేశంతో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ సూచించారు. ఆయన చెప్పినందుకే పేరు మార్చుకున్నాను. పేరు మార్చుకోవడం నాకు కలిసి వచ్చింది అంటోంది కియారా అద్వాని.

ఫుగ్లి చిత్రం ద్వారా 2014లో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు కియారా. ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేస్తున్నారు. తెలుగులో కూడా మహేష్‌ బాబు తో ‘భరత్‌ అను నేను’, రామ్‌ చరణ్‌ తో వినయ విధేయరామ చిత్రంలో నటించింది కియారా.

ప్రస్తుతం కియారా ‘కబీర్‌ సింగ్‌’ సినిమాలో షాహిద్‌ కపూర్‌ సరసన నటిస్తోంది. ఈ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించిన ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌. ఇదే కాక అక్షయ్‌ కుమార్‌ సరసన గుడ్‌ న్యూస్‌ చిత్రలో కూడా కియారా నటిస్తున్నట్లు సమాచారం.