భారీ అమౌంట్ కు ‘RRR’ నైజాం హక్కులు.!

ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ హాట్ గా వినిపిస్తున్న లేటెస్ట్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR). మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ ని ఫిక్స్ చేసినట్టుగా నిన్న క్లారిటీ ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే దేశ వ్యాప్తంగా కూడా చాలా అంచనాలు ఉన్న ఈ చిత్రం రికార్డు శాయి బిజినెస్ ని జరుపుకుంటుంది అని తెలిసిందే.

అందులో భాగంగానే ఈ సినిమా నైజాం హక్కుల డీటెయిల్స్ ఇప్పుడు తెలుస్తుంది. ఒక్క ఈ ఏరియా హక్కులు మాత్రం సుమారు 55 కోట్లు పలికింది అట. దీనిని బట్టి ఈ సినిమా హైప్ ఏ స్థాయిలో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని హక్కులు కలుపుకొని ఈ సినిమా 700 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకుందని టాక్ ఉంది. మొత్తానికి మాత్రం ఇప్పుడు ఈ సినిమా నైజాం బిజినెస్ పై ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వైరల్ అవుతుంది.