రాజకీయాలకు గుడ్ బై.. దేవుడు ఆదేశించాడు..రజినీకాంత్ పాటించాడు.

తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మొదటి నుంచి నాన్చుతూ వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టేకలకు తాను రాజకీయాల్లోకి రావడం లేదని సంకేతాలిచ్చేశాడు. రజనీ మక్కల్ మండ్రం పార్టీని త్వరలో మూసేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారికంగా ప్రకటన రాకున్నా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఈవార్తల్లో నిజం ఉందని తెలుస్తోంది. వయసు మీదపడడం శరీరం మునుపటిలా సహకరిచకపోవడం తదితర కారణాల వల్ల ఇకపై ఇంటి పట్టనే ఉండి శేష జీవితాన్ని ఆస్వాధించాలని రజినీ డిసైడ్ అయ్యాడంటా. త్వరలోనే ‘రజనీ మక్కల్ మండ్రం’ సభ్యులతో చర్చించిన రాజకీయ పార్టీనీ మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తారంటా.

రాజకీయాల్లోకి రావాలని భావించిన మొదట్లో తన అభిమాన సంఘాలతో పలు సార్లు చర్చులు కూడా జరిపారు రజనీకాంత్. ఇప్పుడు కూడా తన ఆనారోగ్యపరమైన ఇబ్బందులను అభిమానల సమక్షంలో వెల్లడించి రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారంటా సూపర్ స్టార్ రజినీకాంత్. తమిళనాడులో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 69 ఏళ్ళ రజనీకాంత్ కు ఆరోగ్యం ఈ మధ్య అస్సలు బాగుండడం లేదు. వైద్యులు కూడా రెస్ట్ తీసుకోవాల్సిందే అని తేల్చిచెప్పేశారు. మద్యపానం, దూమపానం కారణంగా రజనీ తన ఆరోగ్యాన్ని బాగా పాడుచేసుకున్నారు. గతంలో ఇదే అంశాన్ని కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కూడా వెల్లడించారు. తన అభిమానులు ఎవ్వరు ఇలాంటి చెడు వ్యసనాలను అలవాటు చేసుకోవద్దని ప్రాధేయపడ్డారు.

శరీరం మొత్తం గుళ్ల అయిపోయిన ఈ తురణంలో అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి కరోనా బారిన పడొద్దని వైద్యులు సూచించారు. ఒంట్లో శక్తిలేని కారణంగా కరోనా బారిన పడితే బతకడం కష్టమని వైద్యులు తేల్చిచెప్పడంతో రజనీ తన ఆలోచనలు మార్చుకున్నారు. గతంలో రజినీకాతు రెండు మూడుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఒకానొక సందర్భంలో డాక్టర్లే చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. కిందటి సారి ఏకంగా రెండు నెలల పాటు సింగపూర్‌ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఎంతో కాలానికి కోలుకోలేకపోయారు. అతి కష్టం మీద ఇటీవలే ఓ రెండు మూడు సినిమాలు తీశారు. అదే ఊపులో రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.

కానీ ఇంతలో కరోనా వచ్చింది. ఈ మమమ్మారి ఇప్పటికే ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఈ తరుణంలో వ్యాధినిరోధక శక్తి అంతంత మాత్రమే ఉన్న రజనీ కాంత్ రాజకీయాల్లోకి వచ్చి అందర్ని కలవడం సరికాదని డాక్టర్లు తేల్చిచెప్పారు. ఇటీవలే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం ఇలాగే ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలా అన్నింటిని బేరీజు వేసుకున్న తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పి… అభిమానుల మనసులో తలైవాగా ఉండిపోవడమే కరెక్ట్ అని నిర్ణయించారంటా రజనీకాంత్.

అయితే రజనీకాంత్ పార్టీ పెట్టడం లేదన్న వార్తలతో ప్రతిపక్ష డీఎంకేలో సంతోషం వ్యక్తం అవుతుండగా. అధికార అన్నాడీఎంకే నేతలు మాత్రం ఢీలా పడుతున్నారని సమాచారం. రజనీ పార్టీ పెట్టి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయిన తమకు కొంత ప్రయోజనం కలిగేదని అన్నాడీఎంకే నేతలు లెక్కలు వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ లెక్కలన్నీతారుమారు అయ్యాయి.