‘పుష్ప’ కోసం కొత్త విలన్ వస్తున్నాడట.!

‘పుష్ప’ సినిమా మొదట్లో జస్ట్ తెలుగు సినిమాగా రిలీజైంది. తెలుగుతో పాటూ ఇతరత్రా భాషల్లోనూ అనూహ్యంగా సూపర్ హిట్ అవ్వడంతో అది ప్యాన్ ఇండియా మూవీ అయ్యింది.

ఇప్పుడు దేశాలు దాటి రష్యాలోనూ ‘పుష్ప’కు బ్రహ్మరధం పట్టడంతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దాంతో, ‘పుష్ప 2’ పై అంచనాలు ఊహించని విధంగా పెరిగిపోయాయ్.

ఈ నేపథ్యంలో సెకండ్ పార్ట్‌కి సంబంధించి, అన్ని ఈక్వేషన్స్ సహజంగానే మారిపోతాయ్ కదా. ముఖ్యంగా విలన్ విషయానికి వస్తే, సెకండ్ పార్ట్‌లో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ అని మొదటి పార్ట్‌లోనే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

రెండో పార్ట్‌లో భన్వీర్ సింగ్ షికావత్ పాత్రతో హీరో పోరాడడమే కథ. అయితే, ‘పుష్ప2’కి పెరిగిన క్రేజ్ దృష్ట్యా, ఆ పాత్ర పోషిస్తున్న ఫహాద్ పాజిల్ రేంజ్ ఈ సినిమాకి సరిపోదని భావిస్తున్నారట. దాంతో ఆ స్థాయి ఇమేజ్ వున్న మరో విలన్‌ని ఎంగేజ్ చేసే యోచనలో వున్నారట. ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ మధ్యలోనే ఎండ్ చేసేసి, కొత్త విలన్‌తో మరింత పవర్ ఫుల్‌గా కథను ముందుకు నడిపించనున్నారట.

ఈ విషయంలో సుకుమార్ కసరత్తులు ఇంకా పూర్తి కాలేదనీ తెలుస్తోంది. ఆ రేంజ్ విలన్‌గా ఎవరిని సెలెక్ట్ చేయాలా.? అని మల్లగుల్లాలు పడుతోందట ‘పుష్ప 2’ టీమ్.