నటీనటులు: శివ కార్తికేయన్, సత్యరాజ్, మరియా
డైరెక్టర్: అనుదీప్
తమిళ్ హీరోలకు తెలుగు లో ఎప్పటినుండో మంచి క్రేజ్ ఉంది. రజినీకాంత్, కమల్ హాసన్,విక్రమ్, సూర్య, కార్తీ, విజయ్, తాజాగా శివ కార్తికేయన్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు. ‘డాక్టర్’ సినిమా తర్వాత శివ కార్తికేయన్ కి తెలుగు లో కొంత ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ‘ప్రిన్స్’ అనే సినిమాతో లక్ చేసుకుంటున్నాడు. ‘జాతిరత్నాలు’ మూవీ తో హిట్ కొట్టిన అనుదీప్ ఈ మూవీ కి దర్శకుడు. ఈ మూవీ ఎలా ఉందొ చూద్దాం.
కథ :
మన హీరో ఈ మూవీ లో ఓ ఊరిలో హీరో టీచర్ పనిచేస్తూ ఉంటాడు. అదే స్కూల్ లోమరియా బోషప్కా ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. మరియా విదేశీయురాలు కాగా ఇండియా లోని స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా చేరుతుంది. కొన్నాళ్ళకు మన హీరో, హీరోయిన్లు ప్రేమలో పడతారు. కానీ హీరోయిన్ ప్రేమ గెలవడం కోసం హీరో నానా తంటాలు పడతాడు. ఆ స్కూల్ ఉన్న గ్రామ ప్రజలంతా హీరోకు మద్దతుగా నిలుస్తారు. చివరకు హీరో హీరోయిన్ ను గెలిచాడా లేదా అన్నదే ఈ సినిమా కథ. .
సినిమా ఎలా ఉంది అంటే…?
ఈ మూవీ కూడా దాదాపు ‘జాతిరత్నాలు’ లాంటిదే. అస్సలు లాజిక్స్ వెతక్కూడదు. అలాగే సినిమాపై ఎక్కువ అంచనాలు కూడా పెట్టుకోవద్దు. సిల్లీ కామెడీతో లాజిక్స్ లేకుండా తెరకెక్కించిన సినిమానే ప్రిన్స్. ఎమోషన్స్ ని డైరెక్టర్ సరిగ్గా హేండిల్ చెయ్యలేకపోయాడు. సినిమా టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే యావరేజ్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. తమన్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు