పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరు మామూలుగా లేదు. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. సైమల్టేనియస్‌గా ఆయా సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. సంక్రాంతి సీజన్‌లో పవన్ కళ్యాణ్ నుంచి భారీ అంచనాల నడుమ ‘భీమ్లానాయక్’ రాబోతోంది.
ఇక దీంతో పాటు, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’, ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. అలాగే హరీష్ శంకర్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలు ఇప్పటికే లైన్‌లో ఉండగా, మరో నాలుగైదు ప్రాజెక్టులతో ప్రముఖ దర్శక, నిర్మాతలు పవన్ కోసం క్యూలో ఉన్నారట.
2022 చివరికల్లా రాజకీయాల నిమిత్తం ఫుల్ బిజీ అయిపోనున్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఇక మిగిలింది కేవలం 15 నెలల టైమ్ మాత్రమే. ఈ లోగా ఎన్ని సినిమాలు కమిట్ అవుతాడు.? ఆల్రెడీ కమిట్ అయిన వాటిలో ఎన్ని పూర్తి చేస్తాడు.? అని సీరియస్ చర్చ నడుస్తోంది. అయితే, పవన్ కళ్యాణ్‌తో ఎలాగైనా సినిమా చేయాలన్ కోరికతో కనీసం ఆయన వద్ద మాటైనా తీసుకుంటే చాలని, మేకర్లు తహతహలాడిపోతున్నారట. అలా పవన్ ఫిలిం డైరీ నిండిపోతోందట. దటీజ్ పవర్ స్టార్ అంతే.