పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న ‘బ్రో’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. టీజర్‌ని ఆల్రెడీ డిజైన్ చేసేశారు. టీజర్‌ని ఎప్పుడు విడుదల చేస్తారన్నదానిపై నేడో రేపో క్లారిటీ రావొచ్చు.
ఇదిలా వుంటే, సినిమా రిలీజ్‌కి సంబంధించి లెక్కలన్నీ పవన్ కళ్యాణ్ స్వయంగాచూసుకుంటున్నారట. అది కూడా, త్రివిక్రమ్ శ్రీనివాస్ సాయంతోనే లెండి.! లెక్కలంటే, సినిమా బిజినెస్ వ్యవహారాలన్నమాట. గత అనుభవాల నేపథ్యంలో ‘బ్రో’ విషయమై పవన్ కళ్యాణ్ ఆచి తూచి స్పందిస్తున్నారట. ఒకవేళ ఏపీలో ‘బ్రో’ సినిమాకి ఇబ్బందులొస్తే ఏం చేయాలన్నదానిపైనా పవన్ కళ్యాణ్ ఓ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారని తెలుస్తోంది.
ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ విషయంలోనే కొంత కన్‌ఫ్యూజన్ వుంది. రాజకీయ వ్యవహారాల కారణంగా, పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ సినిమా పరంగా కష్టమే కావొచ్చు. అయితే, ప్రమోషనల్ ఇంటర్వ్యూ కోసం దర్శకుడు సముద్రఖని, నిర్మాతలు గట్టిగానే పట్టుబడుతున్నారట పవన్ కళ్యాణ్‌ని ఒప్పించే విషయమై.