పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళకంటే ఎక్కువ అతి చేస్తున్నారా?

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఒక చేగువేరా. 2019 ఎన్నికలు వరకు కూడా పవన్ కళ్యాణ్ తనలోని ఒక చేగువేరా, ఒక కమ్యూనిస్ట్ , లేదంటే ఒక బహుజన సానుభూతిపరుడుని మాత్రమే అందరికి పరిచయం చేసారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన ఓటమి, అందులోనూ స్వయంగా తాను రెండు చోట్లా ఓడిపోవడంతో జనాలకి తనలోని మరొక కొత్త యాంగిల్ ని చూపిస్తున్నారు. అదే సనాతన ధర్మ పరిరక్షకుడు.

Pawan Kalyan

ఈ పాత్రలో ఎంత ఒదిగిపోయారంటే ఈ ధర్మాన్ని ఎప్పటినుండో కాపాడుతున్న స్వామిజీలు, మఠాథిపతులు కూడా ఈయన ముందర చిన్నబోతున్నారు. పవన్ కళ్యాణ్ కు మొదటి నుండి ఏమి చేసిన అందులో అవసరం కంటే ఎక్కువ డోసు ఉండేది. ఉదాహరణకు కమ్యూనిస్టులతో పొత్తు అంటే ఎర్ర తుండు ఎప్పుడు మెడకు వేలాడేది. జనసేన కూలాలను కలిపే భావజాలం తో పుట్టిన పార్టీ. అటువంటి పార్టీ కేవలం కొన్ని అగ్రకులాలను వ్యతిరేకించడం కోసం పుట్టిన బహుజన సమాజ్ వాది పార్టీ తో పొత్తు పెట్టుకోవడం ఒక ఆశ్చర్యం. సమాజ్ వాది పార్టీ తో పొత్తు అనగానే మాయావతి కాళ్ళు మొక్కడం, చదువు ప్రస్తావన వస్తే రెండు లక్షలు పుస్తకాలు చదివాను అని చెప్పడం ఏదైనా డోస్ ఎక్కువే చేస్తారు పవన్ కళ్యాణ్ అని సామాన్య జనానికి అనిపిస్తుంది. అభిమానులకు మాత్రం ప్రతిదాంట్లో నాయకుడి నిజాయతీ మాత్రమే కనిపిస్తుంది.

సరే అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు విషయానికి వస్తే నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు. దేశవిదేశాలకు చెందిన ప్రముఖులంతా ట్విట్టర్ లో ప్రధానికి శుభాకాంక్షలు చెప్పారు. అందరితో పాటు పవన్ కళ్యాణ్ కూడా శుభాకంక్షాలు తెలియజేసారు. అందరూ అత్యంత సాధారణంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి మోడీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అందరిలాగే చేబితే కిక్ ఏముందనుకున్నారో ఏమో. అందుకే ఇక్కడ కూడా తన కొత్త సనాతన ధర్మాన్ని జోడించారు. మీ కోసం ఆ ట్వీట్ కింద వుంది చూడండి. ట్వీట్ చూసిన సామాన్య జనం గతంలో పవన్ కళ్యాణ్ ప్రధానికి ఇదే విధంగా శుభాకాంక్షలు చెప్పారా అని పాత ట్వీట్లని తోడుతున్నారు.

పొద్దుపోయే వరకు పవన్ కళ్యాణ్ ట్వీట్ కి ప్రధాని రీట్వీట్ చెయ్యలేదు. దీన్నే అవకాశంగా తీసుకొని పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కి ప్రధాని స్పందించలేదని జన సైనికులు బాధపడుతున్నట్టు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చెయ్యడం ప్రారంభించారు