Birthday Wishes To Amit Shah: అమిత్ షాకు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు: ‘రాజనీతిజ్ఞుడి లక్షణం’ అంటూ ప్రశంస

భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా బుధవారం దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా అమిత్ షాకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమాల వేదికగా పవన్ కల్యాణ్ తమ శుభాకాంక్షలను తెలియజేస్తూ, అమిత్ షా నాయకత్వాన్ని ప్రశంసించారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన పోస్ట్ చేస్తూ, “గౌరవనీయులైన హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ అమిత్ షా పనితీరును కొనియాడుతూ, “వాస్తవాలు, స్పష్టత, దృఢ నిబద్ధతతో పార్లమెంటులో ప్రభావవంతమైన స్వరంతో ప్రతిపక్ష ప్రశ్నలకు సమాధానమిచ్చే మీ సామర్థ్యం నిజమైన రాజనీతిజ్ఞుడి లక్షణం” అని ప్రశంసించారు.

Birthday Wishes To Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చంద్రబాబు, లోకేశ్ బర్త్ డే విషెస్

ఈ సందర్భంగా అమిత్ షా దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. “ఈ ప్రత్యేకమైన రోజున అమిత్ షా గారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, ధైర్యం ప్రసాదించమని శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. దేశ సేవలో ఆయన ఎల్లప్పుడూ అచంచలంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

కేంద్ర హోంమంత్రి జన్మదినం సందర్భంగా కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన తరఫున పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ శుభాకాంక్షలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Sowmya Shetty And Balaram Shetty First Exclusive Interview | Telugu Rajyam