ఈశాన్య రాష్ట్రాల్లో “కమళ”వికాశం!

ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయల్లో గత నెల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16న త్రిపురలో ఎన్నికలు జరగ్గా… మిగిలిన మేఘాలయా – నాగాలాండ్ లలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. అయితే నేడు (గురువారాం) ఆ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. త్రిపుర, నాగాలాండ్ లలో బీజేపీ హవా కొనసాగుతుండగా.. మేఘాలయ ఫలితాలు మాత్రం హంగ్ ప్రభుత్వం ఏర్పాటుదిశగా వెలువడుతున్నాయి.

నాగాలాండ్ లో 59 స్థానలకు గానూ… “బీజేపీ – ఎండీపీపీ” కూటమి 35 స్థానాల్లో దూసుకుపోతుంది. ఇక మిగిలిన వాటిలో ఎన్.పీ.ఎఫ్. పార్టీ 5, కాంగ్రెస్ 3, ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

త్రిపురలో 60 స్థానలకు గానూ దాదాపు 30 స్థానాల్లో బీజేపీ క్లియర్ గా ఆధిక్యంలో ఉండగా.. లెఫ్ట్ పార్టీలు 16స్థానాల్లో తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.

ఇక మేఘాలయ విషయానికొస్తే… మేఘాలయలో ఉన్న 59 స్థానాల్లో ఎన్.పీ.పీ. 23 సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 7, కాంగ్రెస్ – యూడ్పీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక 10 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు.

అయితే… మేఘాలయ శాసన సభ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా వెళ్తుండటంతో… బీజేపీతో జట్టు కడతామనే సంకేతాలను అధికార ఎన్‌.పీ.పీ ఇప్పటికే పంపిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎన్‌.పీ.పీ ఎంపీ వన్వీరోయ్ ఖర్లుఖి.. ఇది బీజేపీ – ఎన్‌.పీ.పీ కూటమికి లభించిన ప్రజా తీర్పు అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ హంగ్ పై క్లారిటీ వచ్చింది!