వైరల్: సాయిధరమ్ తేజ్‌‌ తో నిహారిక రెండో పెళ్లి!

గతకొన్ని రోజులుగా మెగా డాటర్ నిహారికా కొణిదెల వివాహ బంధంపై ఆన్ లైన్ వేదికగా రకరకాల గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం నిహారిక ఒంటరిగా ఉంటుందని, భర్తతో విభేదించారని, వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయిందని… రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లకు ఊతం ఇచ్చేలా ఆన్ లైన్ లో భార్యా భర్తలిద్దరూ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో అవ్వడం కూడా చేశారు. ఆ సంగతులు అలా ఉంటే…తాజాగా ఒక నిహారికకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది.

నిహారిక వైవాహిక జీవితంపై వస్తున్న పుకార్లు నిజమేనని… ఫలితంగా నిహారికకు త్వరలో నాగబాబు రెండో పెళ్లి చేయబోతున్నారని గాసిప్స్ వస్తున్నాయి. అది కూడా… మెగా మేనళ్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ కి ఇచ్చి నిహారికను వివాహం చేయాలని నాగబాబు ఫిక్సయ్యారని కథనాలొస్తున్నాయి.

అయితే… గతంలోనే నిహారిక ను సాయిధరమ్ తేజ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు అనుకున్నప్పటికీ, వారిద్దరికి అలాంటి ఉద్దేశం లేకపోవడంతో చైతన్య జొన్నలగడ్డకు ఇచ్చి చేశారట. అయితే… ప్రస్తుతం ఆ వైవాహిక బంధానికి బీటలు రావడంతో… ఆ బంధానికి స్వస్థి చెప్పి, మేనల్లుడికే ఇచ్చి పెళ్లి చేయాలని, తద్వారా సొంత చెల్లెలింటికే తన కూతురు ని కోడలిగా పంపాలని నాగబాబు భావిస్తున్నారని వార్తలొస్తున్నాయి.

అయితే… నిహారిక రెండో పెళ్లి వార్తల్లో నిజం లేదని, అదంతా ఫేక్ న్యూస్ అని మెగా ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.