మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు.
“రెండు సంవత్సరాల క్రితం, ఇదే రోజున మా నాన్న చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు,” అని లోకేశ్ పేర్కొన్నారు. ఈ అరెస్ట్‌ను ఆయన తమ కుటుంబానికి మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యానికి కూడా ఒక చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. ఆ ఘటన తమలో ఇప్పటికీ బాధను మిగిల్చిందని, అయినప్పటికీ తమ సంకల్పం మరింత బలపడిందని లోకేశ్ తెలిపారు.
#2YearSinceCBNsIllegalArrest
Two years ago, on this day, my father Shri @ncbn garu was unjustly arrested. This event marked a dark chapter not just for our family, but for democracy itself. The pain of that moment remains, but so does our resolve. His courage, dignity, and… pic.twitter.com/Zi3QtdFcBI— Lokesh Nara (@naralokesh) September 9, 2025
“ఆయన ధైర్యం, హుందాతనం, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉన్న అచంచలమైన నమ్మకం… న్యాయం, సత్యం కోసం మా పోరాటానికి స్ఫూర్తినిస్తోంది” అని లోకేశ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన తండ్రి చంద్రబాబు కోసం న్యాయ పోరాటం కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

