తగ్గేది లేదంటున్న బాలయ్య హీరోయిన్.! ఇలాగైతే కష్టమే.!

చిన్న వయసులోనే చాలా చాలా పెద్ద పాత్రలో కనిపించింది మలయాళీ ముద్దుగుమ్మ. ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో బాలయ్య సరసన నటించిన హనీ రోజ్, అంతకన్నా ముందే తెలుగులో రెండు సినిమాలు చేసింది. కానీ, అవి పెద్దగా ఆడలేదు. అనారోగ్యంతో ‘వీర సింహా రెడ్డి’ సినిమా ప్రమోషన్లకు హీరోయిన్ శృతి హాసన్ డుమ్మా కొట్టడంతో, హనీ రోజ్ దశ తిరిగింది. ఆమెనే సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో బాగా కనిపిస్తోంది.

పైగా, నిండైన రూపం కావడంతో.. అందరి దృష్టీ హనీ రోజ్ వైపు వెళుతుంది. దాంతో, ‘కాస్త తగ్గితే, హీరోయిన్‌గా ఛాన్సులొస్తాయ్..’ అంటూ కొందరు ఆమెకు సూచిస్తున్నారట. తగ్గటమంటే, బొద్దుతనాన్ని తగ్గించమని, కానీ, అందుకు ఆమె ‘కష్టమేమో’ అంటోందిట.

మరోపక్క, ముందు అనుకున్న రెమ్యునరేషన్‌కి అదనంగా చెల్లింపులు చేశారట ‘హనీ రోజ్’కి. కారణం ఆమె సినిమా ప్రమోషన్స్ కోసం కష్టపడుతుండడమేనట.