‘ఏజెంట్’కి అసలు సమస్య నాగార్జునేనా.?

అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘ఏజెంట్’ ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియడంలేదు. హాలీవుడ్ సినిమా తరహాలో ‘ఏజెంట్’ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించినట్లు ఇన్‌సైడ్ సోర్సెస్ నుంచి సమాచారం అందుతోంది.

అలాంటప్పుడు, ‘ఏజెంట్’ విడుదల విషయంలో ఎందుకు మీనమేషాల్లెక్కెడుతున్నట్లు.? దసరా సీజన్ మిస్సయ్యింది. సంక్రాంతి సీజన్ కూడా దాటేసింది. సమ్మర్ అంటున్నారుగానీ, అది కూడా డౌటేనట.

అసలు సమస్య ఎక్కడ.? అని ఆరా తీస్తే, సినిమా ఔట్‌‌పుట్ విషయంలో నాగార్జున సంతృప్తిగా లేడన్నది తాజా ఖబర్. తొలి సినిమా ‘అఖిల్’ విషయంలో కూడా నాగ్ హ్యాపీగా లేడట. అయినా, అఖిల్ మొండిగా ముందుకెళ్ళి డిజాస్టర్ చవిచూశాడు.

కెరీర్ పరంగా అఖిల్, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై నాగార్జున గుర్రుగా వున్నట్లు తెలుస్తోంది. అయినా, ఎంతకాలమని ‘ఏజెంట్’ని నాగ్ ఆపగలడు.?