భార్య మీద ప్రేమతో ఈ భర్త భూగర్భంలో ఏం చేశాడంటే

ప్రపంచ చరిత్రలో కొంతమంది చేసిన పనులు చూస్తుంటే ఔరా అనిపిస్తుంది. అసలు ఇది సాధ్యమేనా అన్నటువంటి అనుమానం తలెత్తుతుంది. తన అందమైన భార్య కోసం షాజహాన్ తాజ్ మహాల్ నిర్మించాడు.హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ కూడా ప్రేమ చిహ్నమే. ఇలాంటి ఘటనలు అన్నీ చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయాయి.

మౌంటెన్ మ్యాన్ దశరథ్ మాంజీ 22 ఏళ్ల పాటు ఒంటరిగా శ్రమించి తమ గ్రామానికి రోడ్డు మార్గాన్ని ఏర్పరిచాడు. ప్రభుత్వం, అధికారుల వల్ల కాని పనిని పట్టుదలతో శ్రమించి 300 అడుగుల ఎత్తైన కొండను నిట్టనిలువునా చీల్చి పక్క గ్రామానికి రోడ్డు మార్గాన్ని సులభతరం చేశాడు. దానికి కారణం మాంజీ భార్య అనారోగ్యంగా ఉండగా సరైన సమయంలో ఆసుపత్రికి చేరుకోలేక మరణించింది. రోడ్డు మార్గం ఉంటే త్వరగా చేరుకునేవారమని భావించిన మాంజీ మరొకరు చనిపోకూడదని అంతలా శ్రమించాడు. తాజాగా ఇలాంటి ప్రేమ కథ ఒక చోట జరిగింది. అదేంటంటే…

భూగర్భంలో ఉన్న కోటలోని భాగం

ఆర్మేనియా దేశంలోని అరింజీ గ్రామానికి చెందిన లెవోన్ అరకెల్యాన్ తన భార్య కోసం ఏకంగా భూగర్భంలో ఓ కోటనే నిర్మించాడు. వస్తువులు దాచుకోవడానికి ఇంటి కింద చిన్న బేస్ మెంట్ కట్టాలని కోరిన భార్యకు విచిత్రమైన బహుమతిని ఆ భర్త అందించాడు. రోజూ కొంచెం కొంచెం తవ్వుతూ భూగర్భంలో ఏకంగా ఓ చిన్న కోటను నిర్మించాడు. దాన్ని అందమైన కళాఖండంగా తీర్చిదిద్దాడు. దీంతో ఆ నిర్మాణం ఆర్మేనియాలో ఇప్పుడు పర్యాటకుల గమ్య స్థానంగా మారింది.

 

భూగర్భంలో నిర్మించిన కోట అందాలు

ఆర్మెనియాలోని ఆరింజ్ గ్రామానికి చెందిన లెవోన్ అరకెల్యాన్ వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. ఆయన బార్య టోస్యా.. టోస్యా ఓ రోజు భర్తతో ఆహర పదార్థాలు, ఇతర వస్తువులు దాచుకోవడానికి ఓ చిన్న బేస్ మెంటు నిర్మించాలని కోరింది. దాంతో అరకెల్యాన్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 23 ఏళ్ల పాటు భూమిని తొలిచి నిర్మాణాలు చేస్తూనే పోయాడు. ఇందులో భాగంగా చేతిపని ముట్ల తోనే 600 టన్నుల మట్టి రాళ్లని తవ్వి పడేశాడు. ఓ అందమైన భవనాన్నే నిర్మించాడు. రోజుకు 18 గంటల పాటు లెవోన్ కష్టపడేవాడట. నిండా ఆరు వేల జనాభా లేని అరింజీ గ్రామానికి లెవోన్ కారణంగా పర్యాటకులు క్యూ కడుతున్నారు. నిజంగా ఇదొక వింతైన విషయమే అని పలువురు అంటున్నారు. భార్య భర్తల ప్రేమకి ప్రతిరూపంగా పలువురు నిలిచారు. భార్య కోసం భూగర్భంలో ఈ భర్త కోటను నిర్మించి ఆమె మనసులో మహారాజు అయ్యాడు. ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించాడు.