పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ చేయబోయే సినిమాకి ఎప్పుడో టైటిల్ అనౌన్స్ చేశాడు. అదే ‘భవదీయుడు భగత్ సింగ్’. కానీ, ఇంతవరకూ సినిమా ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. ఇటీవలే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు లభించాయ్.
పవన్ ఆశీస్సులతోనే హరీష్ తెచ్చిన కథలో మార్పులు చేర్పులు చేశారు. అంతా బాగానే వుందనుకున్న టైమ్‌లో తమిళ సినిమా ‘తెరి’ రీమేక్ కొత్తగా తెరపైకి వచ్చింది ఈ కాంబినేషన్‌లో. దాంతో, మళ్లీ ఈ సినిమాని పక్కన పెట్టేసి ‘తెరి’ రీమేక్‌పై హరీష్ ఫోకస్ పెట్టాడట.
ఆల్రెడీ ‘తెరి’ తెలుగులో ‘పోలీసోడు’గా వచ్చేసిన సంగతి తెలిసిందే. సో, ఈ సినిమాని రీమేక్‌లా కాకుండా జస్ట్ ఆ సినిమాలోంచి ఓ ఆసక్తికరమైన పాయింట్ మాత్రమే తీసుకుని మిగతా కథ అంతా సొంతంగా అల్లేశాడట హరీష్ శంకర్ అది కూడా పవన్ ఇచ్చిన ఇన్‌పుట్స్‌తో.
క్రిష్ కూడా ఈ కథపై ఓ చెయ్యేశాడనీ అనుకుంటున్నారు. ఫైనల్ కరెక్షన్ అయితే గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేశాడనీ అంటున్నారు. మొత్తానికి ఇంత మంది చేతులేసిన ఈ కథ చాలా బాగా రూపాంతరం చెందిందనీ, ఏ క్షణాన్నయినా సినిమా పట్టాలెక్కేయొచ్చుననీ అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.