కరుణానిధి తొలిప్రేమ ఇలా…

ప్రేమ అనే పదం గుర్తుకు రాగానే ప్రతి మనిషికి గుర్తుకు వచ్చేది యవ్వనంలో తమ తొలిప్రేమ. ప్రతి మనిషి ప్రేమలో పడటం సహజమే. ఆ ప్రేమ వెనుక సంతోషాలు బాధలు అన్ని ఉంటాయి. కానీ తొలిప్రేమ జీవితాంతం గుర్తుకు ఉంటుంది. పెళ్లైనా పిల్లలు పుట్టినా చివరకు చచ్చేంత వరకు కూడా తొలిప్రేమ గుర్తుగానే ఉంటుంది. అందరిలాగానే కరుణానిధికి కూడా ప్రేమలో పడ్డాడు. కానీ కరుణానిధి తన ప్రేమలో గెలిచాడో ఓడాడో తెలియాలంటే మీరు కరుణానిధి లవ్ స్టోరీ చదవండి.

కరుణా నిధి కూడా ఓ యువతిపై మనసు పడ్డాడు.ఆమెను ప్రాణంగా ప్రేమించాడు. ఆమె సాంప్రదాయ కుటుంబానికి చెందిన వారు. వీరి ప్రేమకు అందరూ మద్దతు ఇచ్చారు. అయితే అమ్మాయి వాళ్ల సాంప్రదాయం ప్రకారమే పెళ్లి జరగాలని అమ్మాయి తల్లిదండ్రులు షరతు విధించారు. పెరియార్ సిద్దాంతాలను కట్టుబాటుగా పాటించే కరుణానిధి ఈ నిబంధనకు తలొగ్గలేదు. తన సాంప్రదాయం కోసం కరుణానిధి ప్రేమించిన అమ్మాయినే వదులుకున్నాడు. అంతటి గొప్ప ప్రేమికుడు ఈ కరుణానిధి.

కరుణానిధి ప్రేమ ప్రస్తుతం ఉన్న యువతకు ఆదర్శం అని చెప్పవచ్చని పలువురు అంటున్నారు. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి దక్కకపోతే తమ జీవితమే లేనట్టు అంతా అయిపోయిందన్నట్టుగా ఫీలయ్యి తమ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. కానీ కరుణానిధి తన ప్రేమికురాలు దక్కలేదని దేవదాసు కాలేదు. కష్టపడ్డాడు మరో జీవితం గురించి ఆలోచించి గొప్పవాడయ్యాడు. ప్రస్తుత యువత కూడా కరుణానిధిలా ప్రేమ విషయంలో ఆలోచిస్తే గొప్ప వారువుతారు.