బీజేపీ నేతలు ఎక్కడికెళ్ళినా వారి విద్వేషాన్ని వెంటతీసుకునే వెళ్తుంటారు! వారికంటూ రాసిపెట్టుకున్న కొన్ని పురాతన హిందుత్వ భావజాల ఆలోచనలు, ముతక వైఖరి కార్యక్రమాలు, వాటిని ఇతరులపై రుద్దే పనులూ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారనే విమర్శ సమాజంలో ఉన్న సంగతి తెలిసిందే! ఇక వేలంటైన్స్ డే వంటివి వచ్చాయంటే.. వారి పైత్యం పీక్స్ కి చేరిపోతుంది. మంగళసూత్రాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి.. జంటగా కనిపించిన యువతీ యువకులపై వారి పైత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇక వారికి అధికారం కూడా తోడైతే… చెప్పేపనేలేదు. వారి అధికార దర్పంతో, అహంకారపూరిత ధోరణితో అవతలి వాళ్ళను ఎగతాళి చేస్తుంటారు. దీనికి తాజా సాక్ష్యంగా మహిళా దినోత్సవం రోజున బీజేపీ ఎంపీ చేసిన పని కనిపిస్తుంది!
కర్నాటకలోని కోలార్ జిల్లాలోని చన్నైహ మందిరాలో మహిళా దినోత్సవం రోజున బీజేపీ ఎంపీ మునిస్వామి షాపింగ్ మార్కెట్‌ను ప్రారంభించాడు. ఆ సందర్భంగా ఆయనకు ఓ షాపులో ఉన్న మహిళ బొట్టు పెట్టుకోకుండా కనిపించింది. దాంతో పైత్యం పీక్స్ కి ఎక్కిందో.. లేక నశాలం నడినెత్తికి చేరిందో కానీ… అగ్గిమీద గుగ్గిలమైపోయాడు ఆ ఎంపీ! సంస్కారంలోపం పుష్కలంగా ఉండటం వల్లో ఏమో కానీ… వేరేవాళ్ల భార్య అయిన ఆమెపై నోటికి వచ్చినట్లు వాగాడు!
“నీ భర్త బతికే ఉన్నాడు కదా బొట్టు ఎందుకు పెట్టుకోలేదు” అని ఆగ్రహంగా ప్రశ్నించిన ఆ ఎంపీ… “అసలు నీకు ఇక్కడ షాపు పెట్టుకోవాడానికి అనుమతిచ్చిందెవరు? షాపు పేరు వైష్ణవి అని పెట్టుకొని నువ్వు బొట్టుపెట్టుకోవా? బొట్టు పెట్టుకోవద్దని ఎవరైనా నీకు డబ్బులిచ్చారా? బొట్టు పెట్టుకో.. కామన్ సెన్స్ లేదా” అంటూ ఆ మహిళ మీద ఇష్టమొచ్చిన రీతిలో అరిచాడు. అనంతరం… పక్కనున్న మరో మహిళతో “హే ఆ మహిళకు బొట్టు ఇవ్వు” అని కోపంగా అరిచి వెళ్లిపోయాడు!
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై “బీజేపీనాయకులు మహిళలపై మోరల్ పోలీసింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు కార్తీ చిదంబరం విరుచుకపడగా… కామెంట్లతో ఉతికి ఆరేస్తున్నారు నెటిజన్లు! వాటిలో మచ్చుకు కొన్ని ఇప్పుడు చూదాం!
“ఈ ఎంపీగారిని పిచ్చికుక్క ఏమైనా కరిచిందేమో … ఇంజెక్షన్ చేయించండి ప్లీజ్”
“ఈ దరిద్రం ఇంకెన్నాల్లు భరించాల్సి వస్తుందో..”
“ఇంట్లో భార్య మాటవినదేమో… ఆ ఫ్రస్ట్రేషన్ ఇలా బయట చూపిస్తున్నాడు”
“మహిళా దినోత్సవం రోజున… మహిళలకు బీజేపీ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇది”!
ನಿನ್ನ ಗಂಡ ಬದುಕಿದ್ದಾನೆ ತಾನೇ?: ಹಣೆಗೆ ಬೊಟ್ಟು ಇಟ್ಟುಕೊಂಡಿಲ್ಲವೆಂದು ಮಹಿಳೆಯ ನಿಂದಿಸಿದ ಸಂಸದ ಮುನಿಸ್ವಾಮಿ#muniswamy pic.twitter.com/hvinI9VJ8T
— Prajavani (@prajavani) March 8, 2023